- Home
- Entertainment
- హైపర్ ఆది మోసం చేశాడంటూ షూటింగ్‌లో మహిళ హల్‌చల్.. అసలు రూపం బయటపెట్టడంతో నోరెళ్లబెట్టిన వైనం..
హైపర్ ఆది మోసం చేశాడంటూ షూటింగ్‌లో మహిళ హల్‌చల్.. అసలు రూపం బయటపెట్టడంతో నోరెళ్లబెట్టిన వైనం..
హైపర్ ఆదికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఓ మహిళా తనని హైపర్ ఆది మోసం చేశాడంటూ షూటింగ్ స్పాట్‌లో రచ్చ చేసింది. స్టేజ్‌పైకి వచ్చి అసలు రూపం బయటపెట్టింది.

హైపర్ ఆది టాప్ మోస్ట్ కమేడియన్‌గా రాణిస్తున్నారు. అత్యంత క్రేజ్ ఉన్న కమేడియన్ అని చెప్పొచ్చు. టీవీ నటుల్లో స్టార్ కమేడియన్‌గా రాణిస్తున్న ఆయన `జబర్దస్త్` షోతోపాటు `ఢీ`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` వంటి షోస్‌లో పాల్గొంటూ ఆద్యంతం నవ్వులు పూయిస్తున్నారు. మంచి ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఆయన పంచ్‌లకు చాలా మంది అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు.
తాజాగా `శ్రీదేవి డ్రామా కంపెనీ` ప్రోమో ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో హైపర్ ఆదికి సంబంధించిన రెండు ప్రధాన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. సుడిగాలి సుధీర్ స్థానంలో రష్మి యాంకర్‌గా చేస్తున్న నేపథ్యంలో ఓ ఎపిసోడ్ అయిపోయిందిగా, బాబు ఏమన్నాడంటూ రష్మిపై ఆది వేసిన పంచ్ ఆద్యంతం నవ్వులు పూయించింది. ఏమన్నాడంటే.. ఆది, రాంప్రసాద్ లేకపోతే ఇంకా బాగుండూ అన్నాడని రష్మి చెప్పగా, అలా అన్నాడా? అందుకే పంపించామని ఆది చెప్పడం మరింతగా నవ్వులు విరిశాయి.
అనంతరం హైపర్ ఆదికి సన్మానం చేయాలని రాంప్రసాద్ చెప్పడంతో వాడిలాగే(సుధీర్) నన్ను కూడా పంపించేద్దామనుకుంటున్నావ్ రా అన్నారు దీంతో నవ్వులు పూసాయి. రష్మి ఉండి ఘనంగా సన్మానం ప్లాన్ చేశామని రష్మి చెప్పడం, ఆ వెంటనే రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఆదికి సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. కమేడియన్లు ఇమ్మాన్యుయెల్,ప్రసాద్, వర్ష, రష్మి ఇలా అందరూ స్టేజ్‌పైకి వచ్చారు. సన్మానం చేస్తున్నారు.
ఇంతలో ఓ అమ్మాయి వచ్చింది. `శ్రీదేవి డ్రామా కంపెనీ` షూటింగ్ లొకేషన్‌కి వచ్చేసి, చప్పట్లు కొడుతూ, బాగుంది, ఇక్కడ ఓ అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే, అక్కడ మీరంతా సంతోషంగా సన్మానం చేసుకుంటున్నారా? అంటూ నిలదీసింది. ఇది చూసిన ఆది ఆమెని స్టేజ్‌పైకి పిలిచారు. అంతే ఆవేశంగా ఆమె స్టేజ్‌పైకి వెళ్లింది.
ఆది కూడా తనకు సన్మానం వద్దు అని, ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడుఎవరో తేలాలి అని పట్టుబట్టాడు. దీంతో ఆ అమ్మాయి పెద్ద షాకిచ్చింది. తనని మోసం చేసింది నువ్వే అంటూ ఆదిపేరు చెప్పింది. దీంతో ఆదికి దిమ్మతిరిగిపోయింది. ఇప్పుడు నేను మంచి పని చేశానని, అందరు కలిసి సన్మానం చేస్తుంటే నేను మోసం చేశానంటావా? అని నిలదీశాడు ఆది.
అసలు మీ క్లాత్ తీయ్ అనగా, ఆమె తన ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్ ని తీసేసింది. ఆమెని చూసిన వారంతా షాక్ అయ్యారు. రష్మి, పూర్ణ, వర్షతోపాటు హైపర్ ఆది కూడా ఖంగుతిన్నాడు. అయితే ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం కట్ చేశారు నిర్వహకులు. సస్పెన్స్ తో పెట్టిన ఈ సన్నివేశాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఇది స్కిట్‌లో భాగంగా చేసిన డ్రామా అయి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆ తర్వాత పంచ్ ప్రసాద్.. దీనిపై `నేరాలు-ఘోరాలు` ఎపిసోడ్ కి తెరలేపారు. నరేష్, ఇమ్మాన్యుయెల్ లపై ఆది ఆ అమ్మాయికి మోసం చేసిన స్కిట్‌ని డూప్‌గా ప్రదర్శించి చూపించారు. నవ్వులు పూయించారు. దీంతో ఆది మోసం చేశాడని వచ్చిన అమ్మాయితో స్టంట్ చేయించారని వేరే చెప్పక్కర్లేదు. సుధీర్ వెళ్లిపోయాక రష్మి హోస్ట్ చేస్తుంది. ఇటీవల కమేడియన్లుసైతం ప్రతి స్కిట్‌లోనూ ఇలాంటి స్టంట్లు చేసి షాకిస్తున్నారు. ఎంగేజ్ చేస్తున్నారు.