- Home
- Entertainment
- హైపర్ ఆది యాక్సిడెంట్ చేయడంతో చావుబతుకుల్లో వ్యక్తి.. షూటింగ్ జరుగుతుండగానే అరెస్ట్ చేసిన పోలీసులు..
హైపర్ ఆది యాక్సిడెంట్ చేయడంతో చావుబతుకుల్లో వ్యక్తి.. షూటింగ్ జరుగుతుండగానే అరెస్ట్ చేసిన పోలీసులు..
హైపర్ ఆది ఆ మధ్య పలు వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. యాక్సిడెంట్ చేసినందుకు ఏకంగా షోలోనే ఆదిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడిది దుమారం రేపుతుంది.

రష్మి(Anchor Rashmi)) హోస్ట్ గా `శ్రీదేవి డ్రామా కంపెనీ`(Sridevi Drama Company Promo) కామెడీ షో రన్ అవుతున్న విషయం తెలిసిందే. సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడంతో యాంకరింగ్ బాధ్యతలు రష్మి తీసుకుంది. ఇందులో రష్మి టార్గెట్‌గా పంచ్‌లు పేలుస్తున్నారు హైపర్ ఆది(Hyper Aadi). ఈ షోకి ఆయనే హైలైట్‌గా నిలుస్తున్నారు. ఆయన వేసే పంచ్‌లు, ఆయనపై వేసే పంచ్‌లు ఇప్పుడు ఆద్యంతం నవ్వులు పూయిస్తున్నాయి. సుధీర్ లేకపోవడంతో ఆది, రాంప్రసాద్ కలిసి స్కిట్లు చేస్తూ కామెడీని పంచుతున్నారు.
తాజాగా వచ్చే ఆదివారానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో షాకిచ్చే విషయాలను బయటపెట్టారు నిర్వహకులు. హైపర్ ఆదిని అరెస్ట్ చేసేందుకు ఏకంగా స్టేజ్ పైకే పోలీసులు రావడం దుమారం రేపుతుంది. మరి ఇంతకి ఏం జరిగిందంటే.. షోలో భాగంగా హైపర్ ఆది ఓ అమ్మాయితో కలిసి డాన్సులు వేస్తున్నారు. డ్యూయెట్లు పాడుతూ షోకి జోస్ తీసుకొస్తున్నాడు.
ఇంతలో షో జరుగుతున్న సెట్‌లోకి పోలీసులు వచ్చారు. ఆది ఎక్కడంటూ షో సిబ్బందిని కాదంటూ లోపలికి వచ్చేశారు పోలీసులు. అంతేకాదు ఏకంగా స్టేజ్ ఎక్కేశారు. ఇది చూసిన ఆది ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆదినే కాదు, షోలో ఉన్న అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జడ్జ్ గా ఉన్న పూర్ణ, యాంకర్ రష్మి, వర్ష, ఇమ్మాన్యుయెల్, రాంప్రసాద్ ఇలా అందరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
స్టేజ్‌పైకి వచ్చిన పోలీసులు.. ఏమైందో తెలుసా? నువ్వు కారులో వస్తుంటే గుద్ది యాక్సిడెంట్ చేశావ్.ఆ వ్యక్తి ఇప్పుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని బాంబ్ పేల్చాడు. దీంతో అందరు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అటు హైపర్ ఆది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పక్కన ఉన్న నిర్వహకులు.. అది ఆది కాదు, వేరే అయ్యుంటారు, మనం పక్కకు వెళ్లి మాట్లాడుకుందాం రండి సర్ అని సముదాయించే ప్రయత్నం చేయగా, పోలీసులు వినలేదు. మరింతగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాంప్రసాద్‌తోపాటు ఇతర కమెడియన్లు అంతా వచ్చి స్టేజ్‌పైనే పోలీసులతో చాలా సేపు చర్చించారు. వాదోపవాదనలు జరిగాయి. చివరికి పద సార్ అని రాంప్రసాద్ అనగా, మరో వ్యక్తి ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో ఆవేశానికి గురైన పోలీస్ `ఆయన వస్తానంటే నువ్వేవ్వరు ఆపడాని`కంటూ ఆయన్ని నెట్టేయడంతో షో మొత్తం హీటెక్కింది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక షాక్‌లో ఉన్నారు అంతా.
అంతేకాదు చివరగా ఫస్ట్ కెమెరాలు ఆపేయండి అంటూ ఆ సదరు పోలీస్ సీరియస్ కావడంతో అందరిని భయబ్రాంతులకు గురి చేసింది. ఆదిని పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు సైతం కూడా ఉండటం మరింత ఉత్కంఠకి గురి చేస్తుంది. మరి హైపర్ ఆది ఎవరిని యాక్సిడెంట్ చేశారు. ఇంతకి ఏం జరిగింది. పోలీస్‌లే ఏకంగా షోకి వచ్చేంతటి సీరియస్ సిచ్చువేషన్ ఉందా? ఇందులో నిజమెంతా ? అనేది సస్పెన్స్ గా మారింది.
అయితే ఇది కూడా స్కిట్‌లోనే భాగం అయ్యి ఉంటుందని అంటున్నారు నెటిజన్లు. రష్మి వచ్చాక ఇలాంటి ధమ్కీలు ఎక్కువగా ఇస్తున్నారని, అందులో భాగంగానే ఇదొక డ్రామా అయి ఉంటుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సింది. ప్రస్తుతం ఈ `శ్రీదేవి డ్రామా కంపెనీ` ప్రోమో మాత్రం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.