- Home
- Entertainment
- సుధీర్-రష్మీ ల ఆషాడం ఏడాది అంట... హైపర్ ఆది కామెంట్ కి సిగ్గుతో తలదించుకున్న బోల్డ్ యాంకర్!
సుధీర్-రష్మీ ల ఆషాడం ఏడాది అంట... హైపర్ ఆది కామెంట్ కి సిగ్గుతో తలదించుకున్న బోల్డ్ యాంకర్!
సుడిగాలి సుధీర్ ఈటీవీకి దూరం కావడంతో యాంకర్ రష్మీతో ఎడబాటు పెరిగింది. ఏళ్ల తరబడి వాళ్ళ రొమాన్స్ చూసిన ప్రేక్షకులు ఆ ఫ్లేవర్ మిస్ అవుతున్నారు. చాలా కాలంగా సుధీర్-రష్మీ మధ్య కెమిస్ట్రీ నడుస్తుంది.

Rashmi Gautam
జబర్దస్త్ వేదికగా సుడిగాలి సుధీర్, రష్మీ (Rashmi Gautam)మధ్య ఓ రిలేషన్ డెవలప్ అయ్యింది. వారిద్దరిని షో నిర్వాహకులు ప్రేమికులుగా పరిచయం చేశారు. సుధీర్, రష్మీపై స్పెషల్ షోలు, స్కిట్స్ చేయడం సాధారణంగా జరుగుతూ ఉండేది. నోరెత్తి మేము ప్రేమికులమని చెప్పుకున్నా... రష్మీ, సుధీర్ అలానే ప్రవర్తించేవారు. ఈవెంట్స్ లో రొమాన్స్ కురిపించేవారు.
Rashmi Gautam
రష్మీ, సుధీర్(Sudigali Sudheer) లకు ఒకటి రెండు సార్లు పెళ్లి కూడా చేశారు. ఈ ఉత్తిత్తి పెళ్ళిలో నవ దంపతుల వలె వారు మెరిసిపోయేవారు. వారిపై స్కిట్స్, ఈవెంట్స్ చేయడం ఈటీవీకి ఓ సక్సెస్ ఫార్ములాలా మారింది. పదుల సంఖ్యలో ఆ తరహా ఎపిసోడ్స్ చేశారు. అయితే అదంతా గతం. కొన్నాళ్లుగా రష్మీ, సుధీర్ కలిసి కనిపించడం లేదు.
Rashmi Gautam
జబర్దస్త్ తో పాటు ఈటీవీ అన్ని షోస్ నుండి సుధీర్ తప్పుకున్నాడు. అతడు స్టార్ మాకి వెళ్ళాడు. గతంలో సుధీర్ యాంకర్ గా వ్యవహరించిన శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇప్పుడు రష్మీ వచ్చారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
Rashmi Gautam
శ్రీదేవి డ్రామా కంపెనీలో అత్తలు అల్లుళ్ళు కాన్సెప్ట్ తో ఓ స్కిట్ చేశారు. ఈ స్కిట్ మధ్యలో రష్మీ ఆషాడం కదా... అల్లుళ్లు ఉండకూడదు వెళ్లిపోండని అంటుంది. మధ్యలో కలుగజేసుకుని వర్ష.. అక్క బావ అక్కడ ఉన్నాడు కదా.. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి.. అంటూ పంచ్ వేసింది.
Rashmi Gautam
దానికి రష్మీ ఎవరే నీకు అక్కా అంటూ చిరు కోపం నటించింది. ఇక హైపర్ ఆది ఆమెపై భారీ పంచ్ విసిరారు. రష్మీ నీకు సుధీర్ కి ఆషాడం ఏడాది కదా.. అంటూ కామెంట్ చేయగానే షోలో ఉన్నవారంతా నవ్వుకున్నారు. రష్మీ సిగ్గుపడి అటు తిరిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఈ విషయం చోటు చేసుకుంది.
Rashmi Gautam
ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కి నటి ప్రగతి వచ్చారు. ఆమె మాస్ డాన్స్ స్టెప్స్ తో ఎపిసోడ్ కి మంచి ఊపు తెచ్చారు. కాగా ఈటీవీలో ప్రసారం అవుతున్న కామెడీ షోస్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఆదరణ దక్కించుకుంటుంది. హైపర్ ఆది, రష్మీ కారణంగా మంచి రేటింగ్ సాధిస్తుంది.