MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Acharya: హతవిధీ.. ఓటీటీలో కూడా ఇంత దారుణమా, మెగాస్టార్ కి మరో షాక్

Acharya: హతవిధీ.. ఓటీటీలో కూడా ఇంత దారుణమా, మెగాస్టార్ కి మరో షాక్

మెగా పవర్ స్టార్ రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస సూపర్ హిట్స్ ఇచ్చిన  కొరటాల శివకి  ఈ చిత్రం తొలి ఎదురుదెబ్బ.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : May 27 2022, 07:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Acharya

Acharya

మెగా పవర్ స్టార్ రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస సూపర్ హిట్స్ ఇచ్చిన  కొరటాల శివకి  ఈ చిత్రం తొలి ఎదురుదెబ్బ. మెగా అభిమానులైతే ఈ ఫెయిల్యూర్ ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొరటాల స్క్రిప్ట్, దర్శకత్వం పూర్తిగా బెడిసికొట్టాయి. దీనికి తోడు సంగీతం పరంగా మణిశర్మ పూర్తిగా చేతులెత్తేశారు.   

26

ఫలితంగా చిరంజీవి కెరీర్ లోనే ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. వెండితెరపై రాణించలేని ఎన్నో చిత్రాలు ఓటిటిలో ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. అలాగైనా ఆచార్య చిత్రం ఓటిటి ద్వారా ఆడియన్స్ కి రీచ్ అవుతుందేమో అని ఆశించారు. 

36

కానీ ఓటిటిలో కూడా ఆచార్య చిత్రానికి దారుణమైన పరిస్థితే కనిపిస్తోంది. వెండితెరపై బాగాలేని సినిమాలని కూడా ప్రేక్షకులు ఓటిటిలో చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల ఆచార్య చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది. కానీ ఈ చిత్రాన్ని చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని ట్రేడ్ అంటున్నారు. ఆచార్య చిత్రానికి వ్యూస్ నమోదు కావడం లేదు. 

46

వెండితెరపై ఫెయిల్ అయినప్పటికీ కొన్ని చిత్రాలని ప్రేక్షకులు ఓటిటిలో చూస్తూ ఆ విశేషాలని సోషల్ మీడియాలో పంచుకోవడం చూస్తున్నాయి. ఆ చిత్రంలోని ప్లస్ లు మైనస్ లని కామెంట్స్ చేస్తుంటారు. ఆచార్యకు అలాంటిది ఏమీ కనిపించడం లేదు. కనీసం చిరంజీవి కోసం అయినా సినిమా చూసే ప్రేక్షకులు ఉంటారు. కానీ ఆచార్యపై కంప్లీట్ నెగిటివ్ ఫీలింగ్ ఉండడంతో ఈ మూవీ జోలికి ఎవరూ వెళ్లడం లేదు. 

56

ఇది మెగా అవమానమే అని అంటున్నారు. ఒక స్టార్ హీరో చిత్రాన్ని ఈ స్థాయిలో రిజెక్ట్ చేయడం ఈ మధ్యకాలంలో జరగలేదు. అమెజాన్ సంస్థకి కూడా ఆచార్య నష్టాలనే మిగిల్చిందనే టాక్ వినిపిస్తోంది. 

66

ఆచార్య చిత్రం ఫెయిల్యూర్ పై చిరంజీవి ఇంకా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు టాక్. తన ఫ్యూచర్ చిత్రాల విషయంలో ఇది రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలని మెగాస్టార్ భావిస్తున్నారు. చిరంజీవి చూడని సక్సెస్, ఫెయిల్యూర్స్ లేవు. పరాజయం ఎదురైన ప్రతిసారి తాను ఇండస్ట్రీ రారాజుని అంటూ జయకేతనం ఎగరవేసిన సందర్భాలు ఉన్నాయి. అదే తరహాలో బౌన్స్ బ్యాక్ అవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Virosh Wedding : రష్మిక మందన్న మాజీ ప్రియుడిని పెళ్లికి పిలుస్తుందా? శెట్టి గ్యాంగ్‌కు పిలుపు లేదా?
Recommended image2
Allu Arjun : తమ్ముడి పెళ్లికి ముందు అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ.. బన్ని ఇంటికి క్యూ కట్టిన సెలబ్రిటీలు..
Recommended image3
Virosh : ఎట్టకేలకు పెళ్లి ప్రకటన చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, అభిమానులకు ఓ సర్ ప్రైజ్ కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved