స్టార్ హీరో పెద్ద మనసు.. కష్టకాలంలో వారికి సాయం
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో ద్వారా ఈ విషయం తెలుసుకున్న హృతిక్ రోషన్ తన వంతుగా కొంత మందికైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు వంద మంది డ్యాన్సర్‌ల అకౌంట్‌లలో డబ్బు వేశాడు హృతిక్. వారంతా గతంలో ఏదో ఒక సందర్భంలో హృతిక్‌తో కలిసి వర్క్ చేసిన వారే కావటం విశేషం.
ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో జన జీవనం స్థంభించి పోయింది. అన్ని రంగాల లాగే ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా మూతపడింది. ఈ సమయంలో తమ తోటి కళాకారులను ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వంతు సాయం అందించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ముందుకు వచ్చాడు. ప్రస్తుతం షూటింగ్‌లు ఆగిపోవటంతో రోజువారి కూలీలు, డ్యాన్సర్‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో ద్వారా ఈ విషయం తెలుసుకున్న హృతిక్ రోషన్ తన వంతుగా కొంత మందికైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు వంద మంది డ్యాన్సర్‌ల అకౌంట్‌లలో డబ్బు వేశాడు హృతిక్. వారంతా గతంలో ఏదో ఒక సందర్భంలో హృతిక్‌తో కలిసి వర్క్ చేసిన వారే కావటం విశేషం.
డ్యాన్సర్స్ కోఆర్టినేటర్ రాజ్ సురాని మాట్లాడుతూ.. `హృతిక్ రోషన్ 100 మంది డ్యాన్సర్స్‌కు ఈ కష్టకాలంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. వారిలో కొంత మంది తమ గ్రామాలకు వెళ్లిపోయారు. మరికొంతమంది ముంబైలోనే ఉంటూ అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. మరి కొంత మంది కరోనా సోకి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారందరికీ హృతిక్ సాయంచేశాడు.
బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్స్ తమ అకౌంట్లలో డబ్బు పడిన మెసేజ్ చూసుకొని ఎంతో ఆనందపడుతున్నారు. ఈ కష్టకాలంలో తమకు సాయం అందించిన హృతిక్ రోషన్‌కు కృతజ్ఞతలు తెలిజేశారన్న`డు. హృతిక ద్వారా సాయం పొందిన డ్యాన్సర్స్ కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేస్తున్నారు.