MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • `ఈగల్‌` ద్వారా నిర్మాతలకు నష్టం ఎన్ని కోట్లో తెలుసా? రవితేజ సినిమాకి ఇలాంటి పరిస్థితేంటి?

`ఈగల్‌` ద్వారా నిర్మాతలకు నష్టం ఎన్ని కోట్లో తెలుసా? రవితేజ సినిమాకి ఇలాంటి పరిస్థితేంటి?

రవితేజ నటించిన `ఈగల్‌` మూవీ థియేటర్లో రన్‌ అవుతుంది. ఈ మూవీ ఇటీవల డీలా పడిపోయింది. అయితే ఈ సినిమా ద్వారా నిర్మాతలకు మాత్రం భారీగా నష్టాలు వాటిల్లినట్టు తెలుస్తుంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 18 2024, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మాస్‌ మహారాజా రవితేజ నటించిన `ఈగల్‌` మూవీ థియేటర్లో పురిటి నొప్పులను అనుభవిస్తుంది. ఇంకా బ్రేక్‌ ఈవెన్‌ కాలేదు. వీకెండ్‌లో తప్పితే  వీక్‌ డేస్‌లో ఈ మూవీ డీలా పడిపోయింది. తొలి వారంలో బ్రేక్‌ ఈవెన్‌ కి దగ్గరగా వెళ్లింది. కానీ బ్రేక్‌ ఈవెన్‌ అయ్యే పరిస్థితి కావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా సేఫ్‌లోకి వెళ్లడం చాలా కష్టంగానే కనిపిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బుధవారం నుంచే రీ రిలీజ్‌ సినిమాల హవా సాగుతుంది. వాలెంటైన్స్ డే సందర్బంగా చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. `ఓయ్‌` వంటి సినిమాలు అప్పుడు కంటే ఇప్పుడే బాగా ఆడుతున్నాయి. ఇంకా ప్రదర్శించబడుతున్నాయి. దీంతో ఇది `ఈగల్‌` సినిమాపై ప్రభావం పడింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయ్యింది. `ఈగల్‌` మూవీ థియేట్రికల్‌గా సేఫ్‌ అవుతుందా అనేది చూడాలి. 
 

36

ఇదిలా ఉంటే రవితేజ నటించిన `ఈగల్‌` మూవీ కారణంగా నిర్మాతలు మాత్రం భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తిందట. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీగా నిర్మించింది. సుమరు 70కోట్ల వరకు బడ్జెట్‌ అయ్యిందని తెలుస్తుంది. ఇందులో రవితేజకే 25-30కోట్ల వరకు పారితోషికంగా ముట్టిందట. ఇతర ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్ అన్ని కలపి నలభై కోట్లు తాటిందని, సినిమా మేకింగ్‌కి మరో ముప్పై కోట్ల వరకు అయ్యిందని సమాచారం.
 

46

70కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ థియేట్రికల్‌ బిజినెస్‌ కేవలం 22కోట్లు మాత్రమే. ఆడియో వంటి ఇతర రైట్స్ పరంగా దాదాపు ముప్పై దాకా నిర్మాతలకు వచ్చిందట. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ ఓటీటీ కాలేదు. సినిమాని కొనేందుకు ఏ ఓటీటీ సంస్థ ముందుకు రావడం లేదు. కొన్ని వచ్చినా, నిర్మాతలు చెప్పే ప్రైజ్‌ చూసి వెనక్కి తగ్గినట్టు సమాచారం. దీంతో ఇప్పటి వరకు `ఈగల్‌` ఓటీటీ  విషయంలో ఇంకా క్లారిటీ లేదు. దీనికితోడు రవితేజ సినిమాలకు ఓటీటీలో పెద్దగా ఆదరణ లేకపోవడం కూడా ఓ కారణం అని తెలుస్తుంది. 
 

56

ఇలా చూస్తే ఈ సినిమాకి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా నలభై కోట్ల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఓ పెద్ద స్టార్‌ హీరో సినిమాకి ఈ రేంజ్‌ నష్టం వాటిళ్లడం గమనార్హం. `ఈగల్‌`కి యావరేజ్‌ టాక్‌ వచ్చినా థియేట్రికల్‌గా సత్తా చాటలేకపోవడం, మరోవైపు ఓటీటీ సంస్థలు డేర్‌ చేయకపోవడం నిర్మాతల కొంపు ముంచుతుంది. మామూలుగా అయితే థియేట్రికల్‌గా నష్టం వచ్చినా, ఓటీటీ రైట్స్ ద్వారా కొంత సేఫ్‌ అయ్యేవాళ్లు నిర్మాతలు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. పెద్ద హీరో సినిమాలను కూడా ఓటీటీ సంస్థలు కొనేందుకు ముందుకు రాకపోవడం విచారకరం. ఇది ఇండస్ట్రీకే పెద్ద దెబ్బగా మారుతుందని చెప్పొచ్చు. 

66

రవితేజ హీరోగా రూపొందిన `ఈగల్‌` మూవీలో కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటించింది. అనుపమా పరమేశ్వరన్‌ కీలక పాత్రలో నటించింది. ఆమెతోపాటు మధుబాల, శ్రీనివాస్‌ అవసరాల ముఖ్య పాత్రల్లో మెరిశారు. కార్తిక్‌ ఘట్టమనేని ఈ మూవీని రూపొందించారు. స్టయిలీష్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. కథలో విషయం లేకపోవడంతో యాక్షన్‌ నే నమ్ముకున్నాడు దర్శకుడు. సెకండాఫ్‌లో యాక్షన్‌ సీక్వెన్స్ అదిరిపోయాయి. కానీ కథ విషయంలో క్లారిటీ లేకపోవడంతో సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. ఫస్టాఫ్‌లో ఎలివేషన్లు తగ్గించి కథపై ఫోకస్‌ పెడితే సినిమా పెద్ద రేంజ హిట్‌ అయ్యేది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Recommended image2
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image3
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved