జానీ మాస్టర్ ని గోవాలో ఎలా ట్రేస్ చేసి పట్టుకున్నారు?
గోవాలో అరెస్ట్ చేసిన జానీ మాస్టర్‌ను శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో ఆయన్ను హాజరుపరచనున్నారు.
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో అరెస్టయిన స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. సిటీలోని సీక్రెట్ ప్లేస్ లో విచారిస్తున్నారు. గోవాలో అరెస్ట్ చేసిన జానీ మాస్టర్‌ను శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో ఆయన్ను హాజరుపరచనున్నారు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్, ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Jani Master
ఎలా దొరికారు
తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని, విషయం బయట చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని భయపెట్టాడంటూ సహాయ కొరియోగ్రాఫర్(21) రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసు నార్సింగి పోలీస్ స్టేషన్ కు ట్రాన్సఫర్ చేశారు. బాధితురాలి వాంగ్మూలం సేకరించి ఆమె మైనర్‌గా ఉన్నప్పటి(2019) నుంచి లైంగిక దాడి జరుగుతున్నట్లు నిర్ధారించుకుని ఎఫ్‌ఐఆర్‌లో అదనంగా పోక్సో సెక్షన్ చేర్చారు.
Jani Master
ఈ క్రమంలో జానీమాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లగా, నార్సింగి పోలీసులు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. మణికొండలోని నివాసానికి వెళ్లి పనిమనిషిని ప్రశ్నించగా.. జానీమాస్టర్ చెన్నై వెళ్లినట్లు చెప్పారు. పరారైనట్లు నిర్ధారించుకున్న పోలీసులు ఆచూకీ కోసం గాలించగా గోవాలో ఉన్నట్లు టెక్నాలజీ సాయింతో కనిపెట్టారు.
Jani Master
పెద్ద హోటళ్లలో ఉంటే వెంటనే ఆచూకీ తెలుస్తుందన్న ఉద్దేశంతో ఆయన ఒక చిన్నహోటల్‌లో తలదాచుకున్నాడు. పక్కా ఆధారాలు సేకరించిన రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసుల టీమ్ బుధవారం గోవాకు వెళ్లి గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది. శుక్రవారం ఉప్పర్‌పల్లిలోని కోర్టులో హాజరుపర్చే అవకాశముంది.
Jani Master
జానీ మాస్టర్ అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య అయేషా అలియాస్ సుమలత నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసుల్ని కలిశారు. బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ... తన భర్తను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారంటూ ఎవరో కాల్ చేశారని, వివరాలు తెలుసుకునేందుకు వచ్చానని తెలిపారు.
జానీ మాస్టర్ బార్య సుమలత అలియాస్ ఆయేషా మీడియాతో మాట్లాడారు. తన భర్త, జానీ మాస్టర్ ( (Jani Master) ప్రతిభను ప్రోత్సహించేవారని, ఎవరికైనా అవకాశాల్లేకుండా ఆయనెందుకు చేస్తారని సుమలత అలియాస్ ఆయేషా అన్నారు.
ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె నిజం నిరూపిస్తే భర్తను వదిలేస్తానని ఆయేషా అన్నారు. ఓ ఛానల్‌తో ఆమె మాట్లాడారు.
‘‘కొరియోగ్రాఫర్‌గా అగ్ర స్థానంలో ఉండాలి లేదా హీరోయిన్‌గా స్థిరపడాలనేది ఆ అమ్మాయి, ఆమె తల్లి కోరిక. స్టేజ్ షోల నుంచి వచ్చిన ఆమె సినీ రంగాన్ని చూసి ఆ లగ్జరీ లైఫ్ కావాలని కోరుకునేది. తనకెక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని చూస్తుంటుంది.
మైనర్‌గా ఉన్నప్పుడు ఘటన జరిగిందనడానికి సాక్ష్యమేంటి? జానీ మాస్టర్‌తో సాన్నిహిత్యంగా ఉందని ఎవరైనా చూశారా? ఇప్పటి వరకూ ఆ అమ్మాయి బయటకొచ్చి మాట్లాడిందా? అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు మాట్లాడటానికి ఏమైంది?
ఒకవేళ లైంగిక వేధింపులకు గురైతే.. ‘జానీ మాస్టర్ వద్ద పని చేయడం నా అదృష్టం’ అని నవ్వుతూ ఎందుకు చెబుతుంది. ఆ మాట చెప్పినప్పుడు ఆమె ఇబ్బంది పడినట్టు కనిపించలేదు. హైదరాబాద్‌లో.. అసోషియేషన్ కార్డు పొందేందుకు ఆమె దగ్గర డబ్బులేకపోతే.. మాస్టర్ ముంబయిలో ఇప్పించారు. తాను పని చేసిన సినిమాలో కొరియోగ్రాఫర్‌గా అవకాశం కూడా ఇచ్చారు’’ అని అన్నారు.