ఇంత అందం ఎలా సాధ్యం అనుపమా.. శారీలో యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్.. పిక్స్ వైరల్
కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) శారీ లుక్ లో అదుర్స్ అనిపిస్తోంది. యంగ్ హీరోయిన్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా అనుపమా పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

అనుపమ (Anupama Parameswaran) శారీలో దర్శనమిస్తే తన అభిమానులు ఎంతగా సంతోషిస్తారో మాటల్లో చెప్పలేం. ఆమె చీరకట్టులో కనువిందు చేస్తే కుర్రాళ్ల గుండెల్లో అలజడి మొదలవ్వాల్సిందే. అదే తరహాలో అనుపమా తాజాగా మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుందీ బ్యూటీ.
లేటెస్ట్ గా అనుపమా రౌడీ బాయ్స్ చిత్రంతో అలరించింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రౌడీ బాయ్స్ సంక్రాంతి కానుకగా విడుదలై యూత్ ను అట్రాక్ట్ చేసింది. ఈ సినిమాలో లిప్ లాక్ లతో రెచ్చిపోయిన ఈ బ్యూటీ ఒక్కసారిగా అభిమానులను షాక్ కు గురిచేసింది.
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అనుపమ పరమేశ్వరన్ బ్లాక్ బస్టర్ ఎంట్రీ దక్కించుకుంది. ఆమె మొదటి చిత్రం ప్రేమమ్ మలయాళంలో సంచలన విజయం సాధించింది. ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం ‘అ ఆ..’లొ నటించింది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో అనుపమ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఈ సినిమాతో అనుపమకు వరుస ఆఫర్స్ ను దక్కించుకుంది. తమిళం, తెలుగు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అదేవిధంగా ఇటీవల సోషల్ మీడియాలోనూ వరుస ఫొటోషూట్లతో మైమరిపిస్తోందీ బ్యూటీ.
లేస్ట్ గా అనుపమా పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. లేటెస్ట్ ఫొటోల్లోఅనుపమా చీరకట్టులో చాలా అట్రాక్ట్ చేస్తోంది. వైట్ శారీలో, బ్లాక్ ఫుల్ లెన్త్ బ్లౌజ్ లో మతిపోయే పోజులతో అనుపమా అట్రాక్ట్ చేస్తోంది. ఈ పిక్స్ తో ప్రస్తుతం తన అభిమానులు ఖుషీ అవుతున్నారు.
కేరీర్ విషయానికొస్తే అనుపమా ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ కి జంటగా 18పేజెస్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కార్తికేయ 2, హెలెన్, బటర్ ఫ్లై అనే చిత్రాల్లో నటిస్తోంది. విభిన్న పాత్రల్లో కనిపిస్తూ ఆడియెన్స్ ను అలరించనుందీ బ్యూటీ.