- Home
- Entertainment
- అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన మిస్టేక్ వల్ల అట్టర్ ఫ్లాప్ అయిన అల్లు అర్జున్ మూవీ, అలా ఎలా జరిగింది ?
అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన మిస్టేక్ వల్ల అట్టర్ ఫ్లాప్ అయిన అల్లు అర్జున్ మూవీ, అలా ఎలా జరిగింది ?
అల్లు అర్జున్ నటించిన ఒక భారీ బడ్జెట్ చిత్రం అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన మిస్టేక్ వల్ల డిజాస్టర్ అయింది అంటే నమ్మగలరా ? కానీ అదే నిజం అని ఆ చిత్ర దర్శకుడు అంటున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

బన్నీ నుంచి మరో భారీ పాన్ ఇండియా చిత్రం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ ఉన్న హీరో. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ఇండియా బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం బన్నీ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో మరో భారీ పాన్ ఇండియా చిత్రానికి రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్ గతంలో వివి వినాయక్ దర్శకత్వంలో బన్నీ, బద్రీనాథ్ చిత్రాల్లో నటించారు.
అల్లు అర్జున్ బద్రీనాథ్ మూవీ
బన్నీ చిత్రం సూపర్ హిట్ కాగా, బద్రీనాథ్ డిజాస్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ డిజాస్టర్ కావడం వెనుక ఉన్న కారణాన్ని డైరెక్టర్ వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. బద్రీనాథ్ మూవీ దాదాపు 40 కోట్ల బడ్జెట్ లో రూపొందింది. అప్పట్లో టాలీవుడ్ లో ఇది భారీ బడ్జెట్ చిత్రం. మగధీర తర్వాత అంతటి బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఇదే.
అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన పొరపాటు
ఈ చిత్రం విడుదలయ్యాక తొలి షో నుంచే నెగిటివ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. దీనికి కారణం అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన పొరపాటు అని డైరెక్టర్ వివి వినాయక్ తెలిపారు. సినిమా రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న కొన్ని రోజుల తర్వాత కూడా ప్రమోషన్స్ కోసం మా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఎంతలా కష్టపడ్డాం, యాక్షన్ సన్నివేశాలని ఎలా చిత్రీకరించాం, అల్లు అర్జున్ ఎంతలా డెడికేషన్ చూపించారు ? లాంటి విషయాలు తెలిసేలా మేకింగ్ వీడియో సిద్ధం చేశాం.
రిలీజ్ కి ముందే మేకింగ్ వీడియో
సినిమా రిలీజ్ తర్వాత మేకింగ్ వీడియో వదలాలనేది మా ప్లాన్. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ పొరపాటున రిలీజ్ కి ముందే పీఆర్ టీంకి ఆ వీడియో ఇచ్చేశాడు. దీంతో పీఆర్ టీం ఆ వీడియోను అన్ని చానల్స్ లో ప్రకటనల కోసం ఇచ్చేశారు. మాకు తెలియకుండా ఇదంతా జరిగిపోయింది. టీవీలో ఆ వీడియో రావడం చూసి అంతా షాక్ అయ్యాం. ఆ వీడియోలో అల్లు అర్జున్ యాక్షన్ సన్నివేశాల కోసం రోప్స్ కట్టుకుని కనిపిస్తాడు.
అందుకే బద్రీనాథ్ మూవీ ఫ్లాప్
ఆ టైంలో ఆడియన్స్ కి మేకింగ్ వీడియో అనేది కొంచెం కొత్త. దీంతో ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీన్లు, ఫైట్లు అన్నీ నిజం కాదు అని ఆడియన్స్ భావించారు. సినిమాలో వచ్చే యాక్షన్ సీన్లలో ఏ మాత్రం వాస్తవం లేదు అనే ఫీలింగ్ ఆడియన్స్ లో మొదలైంది. మేకింగ్ వీడియో చూసి సినిమా చూసిన జనాలకి ఏమాత్రం నచ్చలేదు. ఆ విధంగా బద్రీనాథ్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన పొరపాటు వల్ల నెగటివ్ టాక్ మొదలైందని వివి వినాయక్ తెలిపారు.