- Home
- Entertainment
- హాట్ డిబేట్: ప్రభాస్ కి అసలైన పోటీ ఎవరు.. ఎన్టీఆర్, చరణ్, యష్, బన్నీ ఫ్యాన్స్ రచ్చ..
హాట్ డిబేట్: ప్రభాస్ కి అసలైన పోటీ ఎవరు.. ఎన్టీఆర్, చరణ్, యష్, బన్నీ ఫ్యాన్స్ రచ్చ..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ కి కూడా సాధ్యం కాని విధంగా వందల కోట్ల బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. కేవలం యంగ్ రెబల్ స్టార్ బ్రాండ్ పైనే నిర్మాతలు ఆదిపురుష్ , సలార్ , ప్రాజెక్ట్ కె లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు నిర్మిస్తున్నారు.

Prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ కి కూడా సాధ్యం కాని విధంగా వందల కోట్ల బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. కేవలం యంగ్ రెబల్ స్టార్ బ్రాండ్ పైనే నిర్మాతలు ఆదిపురుష్ , సలార్ , ప్రాజెక్ట్ కె లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు నిర్మిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి రెండు పరాజయాలు ఎదురయ్యాయి.
Prabhas
ఇటీవల విడుదలైన రాధే శ్యామ్ చిత్రం అంచనాలు తలక్రిందులు చేస్తూ డిజాస్టర్ గా నిలిచింది. అంత మాత్రాన ప్రభాస్ ని తక్కువగా అంచనా వేయలేం. ప్రభాస్ ప్రస్తుతం దెబ్బ తిన్న పులి. ఒక్క హిట్ పడితే నేషనల్ వైడ్ గా బాక్సాఫీస్ లెక్కలు మారిపోతాయి. ఈ తరుణంలో పాన్ ఇండియా స్టార్స్ గురించి హాట్ హాట్ గా డిబేట్ జరుగుతోంది.
Prabhas
ప్రభాస్ కి గట్టి పోటీ ఇచ్చే పాన్ ఇండియా స్టార్ ఎవరు అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బాహుబలి తర్వాత సౌత్ లో చాలానే పాన్ ఇండియా మూవీస్ వచ్చాయి. కేజిఎఫ్ 2 చిత్రంతో యష్ మరోసారి సత్తా చాటాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్, రాంచరణ్.. పుష్పతో అల్లు అర్జున్ కొత్త పాన్ ఇండియా స్టార్స్ గా అవతరించారు.
Prabhas
భవిష్యత్తులో వీరి నుంచి మరిన్ని పాన్ ఇండియా చిత్రాలని అభిమానులు ఆశిస్తారు. గురువారం విడుదలైన కెజిఎఫ్ 2 చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. రోమాలు నిక్కబొడుచుకుని ఎలివేషన్ సీన్స్ తో ప్రశాంత్ నీల్ యష్ ని మరింత పవర్ ఫుల్ గా చూపించాడు.
Prabhas
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. పాన్ ఇండియా స్థాయిలో మీకు ఎన్టీఆర్, రాంచరణ్ , యష్ ల నుంచి పోటీ ఎదురుకానుందా అని ప్రశ్నించారు.దీనికి ప్రభాస్ బదులిస్తూ.. పోటీ ఎక్కడైనా ఉంటుంది. కాకపోతే అది మనం పోటీ అని భావించినప్పుడే. సినిమాకి ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది. అందువల్ల భారీ చిత్రాలు వస్తున్నాయి.
Prabhas
దీనిని నేను పోటీ అని భావించడం లేదు. మేమంతా ఇక నుంచి భారతీయ సినిమాలు చేయబోతున్నాం అని ప్రభాస్ తెలిపాడు. వాస్తవానికి మనం ఇండియన్ సినిమా స్థాయిని కూడా దాటి ప్రపంచ స్థాయికి చేరుకోబోతున్నాము అని ప్రభాస్ కామెంట్స్ చేశాడు.
Prabhas
యష్ ప్రస్తుతం కెజిఎఫ్ పార్ట్ 1, 2 లతో ఇండియాలో మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తమ సత్తాని నార్త్ ఆడియన్స్ కి పరిచయం చేశారు. ఇక అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో హిందీ ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాడు. వీరిలో పాన్ ఇండియా క్రేజ్ ని నిలబెట్టుకునే నటుడు ఎవరు అంటూ.. ప్రభాస్ లాగా భారీ చిత్రాలతో దూసుకుపోయే స్టార్ ఎవరంటూ చర్చ జరుగుతోంది.