- Home
- Entertainment
- అమెరికా వీధుల్లో శ్రీముఖి షికారు.. ఆల్ట్రా మోడ్రన్ లుక్‌లో పిచ్చెక్కిస్తున్న హాట్ యాంకర్
అమెరికా వీధుల్లో శ్రీముఖి షికారు.. ఆల్ట్రా మోడ్రన్ లుక్‌లో పిచ్చెక్కిస్తున్న హాట్ యాంకర్
తెలుగు హాట్ యాంకర్ శ్రీముఖి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. గ్యాప్ లేకుండా ఫారెన్ వీధుల్లో ఎంజాయ్ చేస్తుంది. అందులో భాగంగా పంచుకున్న గ్లామర్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

యాంకర్ శ్రీముఖి(Sreemukhi) రెగ్యూలర్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకుంది. విదేశాల్లో వెకేషన్‌ని వెళ్లింది. గత వారం రోజులుగా ఆమె ఫారెన్‌లోనే గడుపుతుండటం విశేషం. మొదట దుబాయ్ టూర్ వెళ్లిన ఈ భామ.. అట్నుంచి అమెరికా వెళ్లింది. దుబాయ్ టూర్ పూర్తి చేసుకుని ఇప్పుడు యూఎస్‌లో ఎంజాయ్ చేస్తుంది.
అమెరికాలో ప్రస్తుతం సరదాగా గడుపుతుంది. అందులో భాగంగా వాషింగ్టన్ డీసీ వీధుల్లో చక్కర్లు కొడుతుంది. హుషారుగా షికారు చేస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుందీ అందాల భామ. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. Sreemukhi Vacation.
ఇందులో వైట్ ప్యాంట్, వైట్ టీ షర్ట్ ధరించి శ్రీముఖి. స్టయిలీష్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని టాప్ టూ బాటమ్ మ్యాచింగ్ డ్రెసెస్, గాడ్జెట్స్ తో వాహ్ అనిపిస్తుంది. ఆల్ట్రా స్టయిలీష్ లుక్‌లో శ్రీముఖి పిచ్చెక్కిస్తుంది. అభిమానులను ఆకట్టుకుంటుంది.
యాంకర్లకి ఇంటర్నెట్‌లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఈ ముద్దుగుమ్ము పొట్టి పొట్టి దుస్తులేసుకుని థైస్ అందాలతో కవ్విస్తుంటారు. తనకు అభిమానులుగా మార్చుకుంటారు. శ్రీముఖి అందుకు అతీతం కాదు, పైగా మిగిలిన యాంకర్ల కంటే ఆ విషయంలో ముందే ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన షోస్ కోసం ట్రెండీ వేర్ అందాలు ఆరబోస్తూ పంచుకునే ఫోటోలు నెటిజన్లకి మంత్రముగ్దుల్ని చేస్తుంటాయి. ఆమె అందాలు పిచ్చెక్కిస్తుంటాయి. అందుకే ఆమెకి రెగ్యూలర్ ఫాలోవర్స్ గా మారిపోతుంటారు.
ప్రస్తుతం శ్రీముఖి `సరిగమప` షోకి హోస్ట్ గా చేస్తుంది. చాలా కాలంగా ఈ సింగింగ్ షో రన్ అవుతుంది. దీంతోపాటు `జాతిరత్నాలు` షోకి హోస్ట్ గా చేస్తుంది. `జాతిరత్నాలు` స్టాండప్ కామెడీ షో. వీటికి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. ఇటీవలే ప్రారంభించినా మంచి రేటింగ్‌ని దూసుకెళ్తుండటం విశేషం.
ఇలా వరుసగా టీవీ షోస్‌తో బిజీగా ఉన్న శ్రీముఖి ఇప్పుడు కాస్త రిలీఫ్ పొందుతుంది. వెకేషన్‌లో రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేస్తుంది. రెట్టింపు ఎంటర్‌టైన్‌మెంట్‌తో తిరిగి రాబోతుంది.