MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • “డ్యూన్ 2” తెలుగు వెర్షన్ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

“డ్యూన్ 2” తెలుగు వెర్షన్ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ సినిమా కమర్షియల్ గా బాగా వర్కవుట్ అయ్యింది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

2 Min read
Author : Surya Prakash
Published : Jul 29 2024, 07:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Dune 2

Dune-2


రీసెంట్ గా హాలీవుడ్ లో  వచ్చిన క్రేజీ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్  భారీ చిత్రం “డ్యూన్  ”. 2021లో విడుదల అయిన ‘డ్యూన్ ’ హాలీవుడ్‌లో భారీ విజయం సాధించింది. కోవిడ్ కాలంలో కూడా 400 మిలియన్లకు పైగా డాలర్లు వసూలు చేసింది. ఏకంగా ఆరు ఆస్కార్ అవార్డులను కూడా సాధించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌ కూడా  భారీ అంచనాలుతో రిలీజైంది.  అయితే పార్ట్ 1 కి వచ్చిన ఫేమ్ తో పార్ట్ 2 పై కూడా చాలా హైప్ జెనరేట్ అయ్యింది. కానీ ఆ ఎక్సపెక్టేషన్స్ ని అందుకోవడంలో సినిమా మాత్రం పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా కమర్షియల్ గా బాగా వర్కవుట్ అయ్యింది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Dune-2

Dune-2


 “డ్యూన్ 2” చిత్రం అమేజాన్ ప్రైమ్ లో కొన్ని నెలలుగా స్ట్రీమ్ అవుతోంది. అయితే రెంటల్ బేసెస్ లో ఈ సినిమాని అందిస్తున్నారు. అదీ మన దేశంలో కాదు.  అయితే ఇప్పుడు ప్రముఖ యాప్ జియో సినిమాలో అందుబాటులోకి రానుంది. ఇంగ్లీష్ సహా మొత్తం పాన్ ఇండియా భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం హిందీ సహా మరాఠి, బెంగాలీ భాషల్లో రానుంది. అయితే ఈ చిత్రం ఈ ఆగస్ట్ 1 న రిలీజ్ కాబోతునట్టుగా ఫిక్స్ అయ్యింది. 

36
Dune-2

Dune-2


 చిత్రం కథేమిటంటే .... మొదటి  పార్ట్‌లో తండ్రిని కోల్పోయిన తర్వాత శత్రువుల నుంచి తల్లి లేడీ జెస్సికాతో (రెబెక్కా ఫెర్గూసన్) పారిపోతాడు పాల్ అట్రీడియస్ (తిమోతి షాలామే). అలా పారిపోయే క్రమంలో  అరాకిస్ గ్రహంలో విప్లవ కారులైన ఫ్రెమెన్ తెగ ప్రజలతో చేరతాడు. వీరందరూ తమ గ్రహాన్ని కాపాడే రక్షకుడు వస్తాడని ఎప్పుడో పూర్వీకుల కాలం నాటి గ్రంథాల్లో రాసిన భవిష్యవాణిని నమ్ముతారు. దీన్ని జెస్సికా క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. తన కొడుకే వీరు వెతుకుతున్న రక్షకుడని నమ్మించి ఆ తెగల వారిని తన అధీనంలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది.

46
Dune-2

Dune-2

అయితే పాల్ అట్రీడియస్‌కు రాజు అవ్వాలన్న కోరిక ఉండదు. ఫ్రెమెన్ తెగలో ఈ భవిష్యవాణిని నమ్మని వారు కొందరు ఉంటారు. వారిలో చాని (జెండాయా)... పాల్‌తో ప్రేమలో పడుతుంది. ఫ్రెమెన్ తెగతో కలిసి అరాకిస్‌లో మాత్రమే దొరికే ఒక రకమైన డ్రగ్ అయిన స్పైస్‌ని తీసే హార్కొనెన్ తెగ వారిపై దాడులు చేసి వారిని బలహీనపరుస్తూ ఉంటాడు. 

56
Dune Part 2

Dune Part 2


ఇక మొదటి భాగంలో పాల్ తండ్రిని చంపేది ఈ తెగకు చెందిన వారే. తండ్రిని చంపిన వారిపై పాల్ పగ తీర్చుకున్నాడా? జెస్సికా ఆశించినట్లు పాల్ రక్షకుడి అవతారం ఎత్తాడా? అసలు చివరికి ఏమైంది? అన్నది తెలియాలంటే ‘డ్యూన్ పార్ట్ 2’ చూడాల్సిందే.

66


ఈ సినిమాలో పాల్, జెస్సికా ఫ్రెమెన్ తెగలో ఇమిడిపోవడానికి ప్రయత్నించడం, ఆ తెగ వారి నమ్మకాన్ని జెస్సికా తనకు అనుకూలంగా మార్చుకోవడం, మరోవైపు పాల్, చానిల ప్రేమ కథ... ఇలా చాలా మామూలుగా వెళ్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే పాల్ క్యారెక్టర్‌లో ఛేంజ్ కనిపిస్తుందో అక్కడి నుంచి సినిమా స్పీడు పుంజుకుంటుంది. ఈ సినమా యాక్షన్ లవర్స్ కు బాగా ఇష్టపడేలా ఉంటుంది.థియేటర్ లో  మిస్ అయ్యినవారు ఇప్పుడు చూడాలి అనుకుంటే ఈ ఆగస్ట్ 1 వరకు ఆగాలి.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
హాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: వీకెండ్ ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్.. ముఖేష్ త్యాగంతో మారిపోయిన సీన్...
Recommended image2
Ramayana Movie: ముల్లోకాలకు అధిపతి రావణుడు.. రామాయణ నుంచి యశ్ పోస్టర్ వైరల్
Recommended image3
Thriller Movies: ఒళ్లు గగుర్పొడిచే 5 థ్రిల్లర్ సినిమాలు.. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గ్యారెంటీ, ఎక్కడ చూడాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved