Barbie Movie Review: బార్బీ మూవీ రివ్యూ.. కొత్త కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా..?
ఊహాజనిత కథలకు, సినిమాలకు పెట్టింది పేరు హాలీవుడ్. ఇలా జరిగితే ఎలా ఉంటుంది... అలా అయ్యుంటే ఎలా ఉండేది.. అటూ క్రియేటివిటీని భారీ స్థాయిలో వాడేస్తుంటారు హాలీవుడ్ మేకర్స్.. అవతార్ లాంటిసినిమాలు అలా వచ్చినవే.. ఆ కోవలోనే తెరకెక్కింది బార్బీ మూవీ. ఈరోజు(21 జులై) రిలీజ్ కాబోతున్న బార్బీ మూవీ ప్రీమియర్ రెస్పాన్స్ ఏంటీ..? సినిమా గురించి ఏమంటున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇక ఈ సినిమా కథ వియానికి వస్తే.. బార్బీ మూవీ ఒక ఫాంటసీ కామెడీ ఫిల్మ్. ఒక ట్రాన్స్ జెండర్ ఓబార్బీ మధ్య జరిగే కథ ఇది. బార్బీ డాల్స్ కోసం నిజంగా ఒక లోకం ఉంటే... తన లోకం వదిలి సదరు బార్బీ డాల్ భూలోకంలో అడుగు పెడితే ఎలా ఉంటుంది. బార్బీ డాల్ పట్ల మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది. అసలు బార్బీ తన ప్రపంచం వదిలి భూలోకంలోకి ఎందుకు వచ్చింది? వంటి విషయాల సమాహారం. అవుట్ అండ్ అవుట్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్. బార్బీ సినిమా తెరకెక్కింది.
Oppenheimer vs Barbie
ఈసినిమాలో అలన్‌గా మైఖేల్ సెరా మరియు మిడ్జ్‌గా ఎమరాల్డ్ ఫెన్నెల్ వంటి బార్బీస్ మరియు ఇస్సా రే, హరి నెఫ్, అలెగ్జాండ్రా షిప్ప్, కింగ్స్లీ బెన్ అదిర్ మరియు స్కాట్ ఎవాన్స్ బార్బీస్ మరియు కెన్స్ వారి వారి పాత్రలను అద్భుతంగా పండించారు.
Oppenheimer vs Barbie
మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలు చేసిన ఈమూవీ మరో హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్ తో పోటీ పడబోతోంది. అయితే బార్బీసినిమా ఆడవారు ఆకర్షితులయ్యేలా ఉంటుంది. ఆడవారి జీవితం ఎలా ఉంటుంది అనేది చాలా సినిమాల్లో డిఫరెంట్ డిఫరెంట్ కథల ద్వారా తెలియజేశారు ఫిల్మ్ మేకర్స్. అయితే ఈ బార్బీ సినిమా ద్వారా మరోసారి మహిళలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ను కళ్ళకు కట్టినట్టు చూపించారు. బార్బీ గర్ల్ ఫేస్ చేసిన ఇబ్బందులు గురించి... వాటి నుంచి ఆమె ఎలా బటయ పడింది అనేది చూపించే ప్రయత్నం చేశారు.
Oppenheimer vs Barbie
లేడీస్ ఇష్టపడే కంటెంట్ పుష్కలంగా ఉందీ సినిమాలో కాని అన్ని వర్గాలను ఆకర్షిస్తుంది అని మాత్రం చెప్పలేం. ఎందుకుంటే ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ చూసిన చాలా మందిలో కొంత మంది.. బార్బీ మూవీపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాని ఈ మూవీ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓవర్ ఆల్ గా మహిళలకుసంబంధిచిన కంటెంట్ ఫుష్కలంగా ఉండటంతో.. వారికి సబంధించిన మెసేజ్ ఉండటంతో.. వారినుంచే ఎక్కువ స్పందన లభిస్తుంది.
Photo Courtesy: Instagram
ఇక ఈ సినిమా ను తెరకెక్కించిన గ్రేటా గెర్విగ్.. సినిమాను అద్భుతంగా డ్రైవ్ చేసింది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం కాస్త నెగెటీవ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకురాలు గ్రేట ఎక్కువగా మహిళలు, మరియు వారు ఎదుర్కొనే సమస్యలపై ఎక్కువగా సినిమాలు చేస్తుంటారు. ఆమె గతంలో లేడీ బర్డ్ మరియు లిటిల్ ఉమెన్‌ల లాంటి కొన్ని సినిమాలు చేసిన గ్రేటా.. ఈసినిమా విషయంలో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.
ఓవర్ ఆల్ గా ఈసినిమా అందరిని మెప్పించలేకపోయినా.. డిఫరెంట్ మూవీగా మాత్రం నిలిచిపోయింది. ఈరోజు థియేటర్లోకి వస్తున్న ఈసినిమా ప్రీమియర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రిలీజ్ తరువాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి. . కాని సినిమా మాత్రం స్లోగా జనాలకు ఎక్కడం ఖాయంగా తెలుస్తోంది.