- Home
- Entertainment
- Karthika Deepam: హిమ ముందు జ్వాలతో క్లోజ్ గా ఉంటున్న నిరుపమ్.. హిమకు మరో పెళ్లి చేయడానికి సిద్ధమైన సౌందర్య!
Karthika Deepam: హిమ ముందు జ్వాలతో క్లోజ్ గా ఉంటున్న నిరుపమ్.. హిమకు మరో పెళ్లి చేయడానికి సిద్ధమైన సౌందర్య!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే సౌందర్య (Soundarya) దంపతులు ప్రేమ్ (Prem) ఇంటికి వెళతారు. కానీ ప్రేమ్ సౌందర్య మీద కోపంతో వాళ్లని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. ఇక ఈ లోపు సత్య వచ్చి హిమ నిరూపమ్ ను ఎందుకు కాదు అన్నదో ఎంత ఆలోచించినా తట్టడం లేదు అని అంటాడు. నీకేమైనా చెప్పిందా అని అంటాడు.
ఇక సౌందర్య (Soundarya) హిమకు వేరే పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తాం అని చెప్పాలి అలా చేస్తే అయినా తన మనసులోని మాట బయట పెడుతుంది అని అంటుంది. ఇక దీనికి పరిష్కారం కూడా మనమే వెతకాలి అని అంటుంది. మరోవైపు హిమ (Hima) జ్వాల, నిరూపమ్ లను కలపాలి అని మనసులో అనుకుంటుంది.
ఈ లోపు అక్కడకు సౌందర్య (Soundarya) దంపతులు వచ్చి అసలు నిశ్చితార్థం క్యాన్సిల్ చేయడానికి కారణం ఏమిటి? అని నానా రకాల మాటలు అంటారు. అంతేకాకుండా నిరూపమ్ (Nirupam) కి, శోభా కు స్వప్న పెళ్లి జరిపిస్తుంది అని సౌందర్య చెబుతుంది. అంతేకాకుండా ఎప్పటికైనా నిరూపమ్ ను నా మనవరాలే చేసుకుంటుందని ఛాలెంజ్ చేసి వచ్చాను అని అంటుంది.
మరోవైపు సప్న (Swapna) ఆ ఆటో అమ్మాయితో నువ్వు తిరగడం నాకు నచ్చలేదు రా అని నిరూపమ్ (Nirupam) తో అంటుంది. ఇక నిరూపమ్ ఇవేవీ పట్టించుకోవద్దని వాళ్ళమ్మకు టాబ్లెట్ ఇస్తాడు. ఇక జ్వాలకి చెప్పి ఫుడ్ తెప్పిస్తున్నాను మమ్మీ అని అంటాడు. దాంతో స్వప్న ఎంతో కోపం వ్యక్తం చేస్తుంది. ఈ లోపు అక్కడకు జ్వాల వంటలు తీసుకొని వస్తుంది.
ఇక జ్వాల (Jwala) ను చూసిన స్వప్న (Swapna) ఎంతో చిరాకు పడుతుంది. ఈలోగా అక్కడకు శోభా కూడా వచ్చి జ్వాల ను చూసి చీదరించు కుంటుంది. ఇక జ్వాల స్వప్న కాళ్ల మీద పడి నట్టుగా కిందకు వంగి అక్కడ పడి ఉన్న డబ్బులను తీస్తుంది. ఓకే మేడం ఉంటాను అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఆ తర్వాత శోభా (Shobha) నువ్వు హిమ (Hima) ముందు ఇంకో అమ్మాయి తో క్లోజ్ గా ఉండు.. కచ్చితంగా నీకు హిమ దగ్గర అవుతుంది అని నిరూపమ్ తో అంటుంది. ఆ మాటతో నిరూపమ్ జ్వాల చేయి పట్టుకొని హిమ ముందు నడుస్తాడు. హిమ స్టన్ అవుతుంది. మరోవైపు శోభా నిరూపమ్ నాతో క్లోజ్ గా ఉంటాడు అనుకుంటే.. జ్వాలతో ఉంటున్నాడు ఏంటి? అని ఆలోచిస్తుంది.