2021 లో రహస్య వివాహాలు చేసుకున్న హీరోయిన్స్..!
దాదాపు ఏడాదిన్నర కాలం కరోనా కోరల్లోనే ముగిసిపోయింది. లాక్ డౌన్ పరిస్థితులు అందరినీ ఖాళీగా కూర్చోబెట్టాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులకు షూటింగ్స్ లేక ఖాళీ సమయం దొరికింది. ఇదే అదనుకుగా భావించి పెళ్లిళ్లు చేసుకున్నారు కొందరు నటులు. మరి 2021లో పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్స్ ఎవరో చూద్దామా...
ఉరి ది సర్జికల్ స్ట్రైక్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆదిత్య ధార్ తో ఏడడుగులు వేసింది హీరోయిన్ యామి గౌతమ్. అనుకోకుండా జరిగిన ఈ పెళ్లి తంతు యామి గౌతమ్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. జూన్ 2021లో కోవిడ్ నిబంధనల మధ్య వీరి వివాహం జరిగింది.
బాలీవుడ్ హీరోయిన్ అంగీర ధార్ దర్శకుడు ఆనంద్ తివారిని వివాహం చేసుకున్నారు. 2021 ఏప్రిల్ లో రహస్యంగా అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. లవ్ పర్ స్క్వేర్ పూట్ సినిమాకు ఆనంద్ దర్శకత్వం వహించగా, అంగీర ధార్ నటించారు.
సాహో ఫేమ్ ఎవ్లీన్ శర్మ చాలా కాలంగా ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్ సర్జన్ తుషాన్ బింది తో డేటింగ్ చేస్తున్నారు. ఇక ఈ ప్రేమ జంట మే 2021లో బ్రిస్పెన్ నగరంలో వివాహం చేసుకున్నారు.
గుట్టుగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది హీరోయిన్ ప్రణీత శుభాష్. బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును ఆమె వివాహం చేసుకున్నారు. మే 30న వీరి వివాహం జరుగగా, ఆ తదుపరి రోజు విషయం బయటికి రావడం జరిగింది. అప్పుడు ప్రణీత తన వివాహం గురించి ఫ్యాన్స్ కి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
హీరోయిన్ దియా మీర్జా బిజినెస్ మాన్ వైభవ్ రేఖీని వివాహం చేసుకోవడం జరిగింది. హిందూ సాంప్రదాయ పద్దతిలో నిరాడంబరంగా వీరి వివాహం ఫిబ్రవరి 2021లో జరిగింది.