బేబీ బంప్ ఫోటోలతో కాస్త శృతిమించిన టాలీవుడ్ హీరోయిన్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?
ఈమధ్య ఫోటో షూట్ల కల్చర్ ఎక్కువైపోయింది. ముఖ్యంగా హరోయిన్లలో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. పెళ్ళై.. ప్రెగ్నెంట్ లు అయినా సరే.. ఫోటో షూట్లు మాత్రం వదలడంలేదు.

ఈమధ్య ప్రతీ విషయానికి.. ఫోటో షూట్లు బాగా అలవాటు చేసుకున్నారు జనాలు. ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే.. చిన్న చిన్న వాటికి కూడా ఫోటో షూట్స్ అంటూ వెగటు పుట్టిస్తున్నారు. ముఖ్యంగా బేబీ బంప్ ఫోటో షూట్ అంటూ.. గర్భిణులు ఇష్టం వచ్చినట్టుగా డ్రస్సింగ్ చేసుకుని చేస్తున్న ఫోటో షూట్లు ఇస్తున్న ఫోజులకు నెట్టింట్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కొంత మంది సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారు.
గతంలో పెళ్ళిళ్లు, బర్త్ డేలు, ఇతర చిన్న చిన్న ఫంక్షన్లకు పోటోలు ఉండేవి. కాని ఇఫ్పుడు ఫోటో షూట్లు చేయడానిక.. ఫోటోలు దిగడానికి అసలు అకేషప్ అవసరం లేదు. తాజాగా ఓ నటి చేసిన బేబీ బంప్ ఫోటో షూట్ కాస్త శృతి మించినట్టు అనిపిస్తోంది. నటి విదిశ శ్రీవాత్సవ మరో నెలలో బిడ్డకు జన్మనివ్వబోతోంది. తాను గర్భవతిని అంటూ బోల్డ్ మెటర్నటీ ఫోటో షూట్లతో ప్యాన్స్ తో కొన్ని ఫోటోలు శేర్ చేసింది బ్యూటీ.
అయితే ఈ ఫోటోలు కాస్త ఇబ్బందికరంగా ఉంటటంతో.. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. జులైలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది ఈ విదశ. ఆమె నిండుగా 9 నెలల గర్భంతో ఉండగా.. వంటిమీద ఎరుపు, తెలుపు వస్త్రాలు చాలీ చాలకుండా ఉన్నవి దర్శనం ఇస్తున్నాయి. ఆ చాలీ చాలని దుస్తుల్లోనే.. బేబీ బంప్ తో.. ఫోటోలకు ఫోజులిచ్చింది.
విదిశ టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. ఆమె 2007లో మా ఇద్దరి మధ్య అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆతరువాత ఆమె నరేష్ అత్తిలి సత్తిబాబు, శ్రీకాంత్ తో దేవరాయ చేసింది. ఇక ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో కూడా ఉన్నిముఖుందన్ బార్యగా నటించింది. అయితే ఇన్ని సినిమాలు చేసినా ఆమెకు టాలీవుడ్ లో రావల్సిన గుర్తింపు రాలేదు.
2018లో సాయక్ పాల్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకున్న ఆమె.. ఆతరువాత కూడా యాక్టింగ్ కొనసాగించింది. తమిళంలో కొన్ని సినిమాల్లో నటించి.. .హిందీలో పలు సీరియల్స్‌లో నటిస్తోంది.భాబీజీ ఘర్ పర్ హై అనే సీరియల్‌లో బిజీగా ఉండగానే ఆమె ప్రగ్నంట్ అని తెలిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆ విషయాలు వెల్లడించింది.
తను ఎంతో ఇష్టపడి ఆ సీరియల్ చేస్తున్నట్టు ప్రకటించిన ఆమె.. డెలివరీ తరువాత మళ్లీ జాయిన్ కాబోతున్నట్టు ప్రకటించింది. అంతే కాదు. తనకు తన భర్త సపోర్ట్ ప్రతీ విషయంలో ఉంది అంటోంది బ్యూటీ. అటు సీరియల్ టీమ్ కూడా తనను బాగా చూసుకుంటుననారి. ప్రెగ్నన్సీ అయినా కూడా మొన్నటి వరకూ షూటింగ్ కు వెళ్లినట్టు ఆమె తెలిపింది.