- Home
- Entertainment
- నాకు తెలియకుండా నా పెళ్ళి సెట్ చేసినందకు థ్యాంక్స్, వెటకారంగా స్పందించిన వర్ష బొల్లమ్మ
నాకు తెలియకుండా నా పెళ్ళి సెట్ చేసినందకు థ్యాంక్స్, వెటకారంగా స్పందించిన వర్ష బొల్లమ్మ
పెళ్ళి వార్తలపై స్పందించింది హీరోరోయిన్ వర్ష బొల్లమ్మ. తాను ఓ బడా నిర్మాత ఇంటికి కోడలు కాబోతున్నట్టు వస్తున్న వార్తలపై వెటకారంగా ట్వీట్ చేసింది బ్యూటీ. సెటైర్ల మీద సెటైర్లు వేసింది.

టాలీవుడ్ లో సెకండ్ క్లాస్ హీరోయిన్ల లిస్ట్ లో వర్ష బొల్లమ్మ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా కుదురుకుంటున్న వర్ష త్వరలో పెళ్ళి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియా కోడై కూడాసింది. అంతే కాదు ఆమె ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి కోడలుగా వెళ్లబోతున్నట్టు రూమర్స్ గట్టిగా వినిపించాయి.
అంతే కాదు ఆ ప్రొడ్యూసర్ వర్ష టాలెంట్, అందం చూసి ముచ్చటపడి.. కోరి మరీ కోడలు చేసుకోబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అయ్యింది. దాదాపు సోషల్ మీడియా అంతటా.. ఈ వార్త హల్ చల్ చేసింది. ఇక ఇది అటు ఇటు చేరి.. చివరకి ఆ హీరోయిన్ దగ్గరకు వెళ్ళింది. దాంతో ఈ వార్తలపై సోషల్ మీడియాలో స్పందించింది వర్ష బొల్లమ్మ.
ట్విట్టర్ వేదికగా స్పందించిన వర్ష.. ఈ రకంగా రాసుకొచ్చింది. నాకు తెలియకుండానే నా పెళ్ళి చూపులు చూసి.. నా కోసం ఒక అబ్బాయిని సెట్ చేసినందకు అన్ని బెబ్ సైట్స్ కు థ్యాంక్స్. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో నాకు చెపితే.. మా ఇంట్లో వాళ్లకు చెప్పుకుంటాను అని అన్నారు వర్ష,
అంతే కాదు ప్రస్తుతానికి తన పెళ్ళి చూపులు చూడాలి అని మీరు అనుకుంటే ఆహాలో స్వాతిముత్యం సినిమా చూడండి అంటూ సలహా కూడా ఇచ్చింది బ్యూటి. ఆమె పెళ్ళి గురించి నాలుగైదు యాంగిల్స్ లో.. రకరకాల మసాలాలు దట్టించిన న్యూస్ లు వైరల్ అయ్యాయి. వాటికి సబంధించిన స్క్రీన్ షాట్స్ ను కూడా ఆమె పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చూసి చూడంగానే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది వర్ష. టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ల లిస్ట్ లో వర్ష బొల్లమ్మ పేరు ఖచ్చితంగా ఉంటుంది. టాలీవుడ్ కంటే ముందు తమిళంలో చాలా సినిమాలు చేసింది. తెలుగులో మాత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది.
ఆనంద్ దేవరకొండ తో హీరోగా తెరకెక్కిన మిడిల్ క్లాస్ మెలోడీ మూవీ తరువాత వర్షకు వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి. అంతే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కూడా దక్కింది. ఇక ఆతరువాత ఆనందోదేవకొండతోనే పుష్పక విమానం సినిమా చేసింది వర్ష.
ఇక రీసెంట్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ జోడీగా స్వాతిముత్యం సినిమాలో నటించి మెప్పించింది వర్ష బొల్లమ్మ వర్ష చాలా అందంగా ఉంటుంది. ఆమె అభినయం కూడా చాలా చక్కగా ఉంటుంది. స్క్రీన్ పై వర్ష నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.