MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టీచర్ ఇంత గ్లామరస్ గా ఉంటే స్టూడెంట్స్ బడికి వద్దన్నా వెళతారు... ఏజెంట్ బ్యూటీ ఊర్వశి షాకింగ్ లుక్ వైరల్!

టీచర్ ఇంత గ్లామరస్ గా ఉంటే స్టూడెంట్స్ బడికి వద్దన్నా వెళతారు... ఏజెంట్ బ్యూటీ ఊర్వశి షాకింగ్ లుక్ వైరల్!

ఎపుడూ హాట్ గా కనిపించే ఊర్వశి రాతెలా కొత్త గెటప్ లో కిక్ ఇచ్చారు. టీచర్ లా కనిపించి షాక్ ఇచ్చారు. మేడమ్ ఇంత అందంగా ఉంటే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : May 04 2023, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Urvashi Rautela

Urvashi Rautela

హీరోయిన్ ఊర్వశి రాతెలా తన కొత్త సినిమా లుక్ షేర్ చేశారు. టీచర్ గెటప్ లో ఆమె అదిరిపోయారు. ఊర్వశి రాతెలాను ఇలాంటి రోల్ ఊహించలేదని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఊర్వశి రాతెలా ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. 
 

28
Urvashi Rautela

Urvashi Rautela


తెలుగు చిత్రాల్లో ఊర్వశి రాతెలా వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. లేటెస్ట్ రిలీజ్ ఏజెంట్ మూవీలో 'వైల్డ్ సాలా' సాంగ్ చేసింది ఊర్వశి. అలాగే ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య మూవీలో ఒక సాంగ్ లో నటించారు. వాల్తేరు వీరయ్య చిత్రంలో చిరంజీవితో కలిసి ఎనర్జిటిక్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. 'బాస్ పార్టీ' సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగింది. 
 

38
Urvashi Rautela

Urvashi Rautela


మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఊర్వశి రాతెలా మిస్ దివా 2015 విన్నర్. విశ్వసుందరి పోటీల్లో కూడా పాల్గొంది. పలు బ్యూటీ కాంపిటీషన్స్ లో మెరిసింది. ప్రాణం పోసుకున్న బార్బీ డాల్ లా ఉండే ఊర్వశి అందాలకు కోట్లలో అభిమానులు ఉన్నారు. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఏకంగా 6.4  కోట్లమంది  ఫాలో అవుతున్నారు.

48

వాల్తేరు వీరయ్య చిత్రంలో స్పెషల్ ఐటెం నంబర్ చేసిన ఈ బోల్డ్ బ్యూటీ టెంపరేచర్ పెంచేశారు. ప్రేక్షకులు సీట్లలో నుండి లేచి డాన్సులు చేశారు. చిరంజీవితో కలిసి ఎనర్జిటిక్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. ఊర్వశి తెలుగు జనాలకు తెగ నచ్చేశారు. 'బాస్ పార్టీ' సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతుంది. 
 

58


కాగా గత ఏడాది ఊర్వశి  తమిళ మూవీ ది లెజెండ్ లో నటించారు. శరవణన్ అరుళ్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆశించినంతగా ఆడలేదు. అయితే ఊర్వశి మాత్రం కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. గుర్తింపు లేని హీరో కావడంతో పాటు ఆయన కోరి ఎంచుకోవడంతో బాగా డిమాండ్ చేసిందట. శరవణన్ సొంతగా నిర్మించి నటించారు.

68


హీరో ఎవరైతేనేమీ నేను అడిగింది ఇచ్చేస్తే చాలన్న పద్ధతి ఊర్వశి శరవణన్ అరుళ్ విషయంలో ఫాలో అయ్యింది.  నాలుగైదు సినిమాల సంపాదన ది లెజెండ్ మూవీతో రాబట్టింది. ది లెజెండ్ పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేశారు. వ్యాపారవేత్త హీరోగా మారడంతో సినిమాకు ప్రచారం దక్కింది. కొంచెం కంటెంట్ ఉన్నా... సినిమాకు ఫలితం దక్కేది.
 

78


నెక్స్ట్ రామ్ పోతినేని మూవీలో ఊర్వశి రాతెలా కనిపించనుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ నటిస్తున్న చిత్రంలో ఊర్వశి ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం అందుతుంది. ఈసారి పూర్తి స్థాయిలో ఊర్వశి అందాలు తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేయనున్నారు. 

88

రామ్-బోయపాటి శ్రీను మూవీ సైతం పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇది ఉండనుంది. అఖండ మూవీ తర్వాత బోయపాటి నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ చిత్రం విజయం సాధిస్తే ఊర్వశి రాతెలా కెరీర్ కి ప్లస్ అవుతుంది. ఆమెకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ రావచ్చు.
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
విలన్ కంటే చాలా పొట్టిగా ఉండడంతో స్టూల్ ఎక్కి డైలాగ్ చెప్పమన్న రాజమౌళి.. ఆ నటుడు ఏం చేశాడో తెలుసా
Recommended image2
Illu Illalu Pillalu April 7 Episode: లారీతో యాక్సిడెంట్ ప్లాన్ చేసిన భాగ్యం, చందుకు బదులు బలైన ప్రేమ
Recommended image3
Allu Arjun Top 5 Films: బాక్సాఫీసుని షేక్‌ చేసిన బన్నీ టాప్‌ 5 మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved