- Home
- Entertainment
- రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో ముంబై ఈవెంట్ లో తమన్నా హల్‌చల్.. మరోసారి బయటపడ్డ ప్రేమ వ్యవహారం?
రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో ముంబై ఈవెంట్ లో తమన్నా హల్‌చల్.. మరోసారి బయటపడ్డ ప్రేమ వ్యవహారం?
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రేమ వ్యవహారం మరోసారి బయటపడింది. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి మిల్క్ బ్యూటీ హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

కొన్నాళ్లుగా స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) పెళ్లి గురించి వార్తలు వస్తున్నా... మిల్క్ బ్యూటీ మాత్రం వాటిని కొట్టిపారేస్తూ వచ్చింది. కానీ, 2023 న్యూ ఈయర్ సెలబ్రేషన్స్ ను గోవాలో చేసుకున్న తమన్నా.. తన భాయ్ ఫ్రెండ్ తో కలిసి సందడి చేసినట్టు వార్తలో నిలిచింది.
గోవాలో తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ నటుుడు విజయ్ వర్మ (Vijay Varma)తో కలిసి రచ్చ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. అలాగే తన ప్రియుడికి ముద్దుపెడుతున్న ఓ వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ బాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఇక తాజాగా మరోసారి స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రేమ వ్యవహారం బయటపడింది. నిన్న ముంబైలో నిర్వహించిన ఎల్లే అవార్డ్స్ ఫంక్షన్ లో నటుడు విజయ్ వర్మతో కలిసి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో వీరి జంట ఈవెంట్ లో ఆకర్షణీయంగా మారింది.
ఈ సందర్భంగా మిల్క్ బ్యూటీ తమన్నా, విజయ్ వర్మ కలిసే ఈవెంట్ కు హాజరైనట్టు.. ఓకే కారులో వెళ్లినట్టు కూడా మరికొన్ని కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అవార్డు పంక్షన్ లో తమన్నా, విజయ్ లు స్టైలిష్ గా ఫొటో గ్యాలరీలో పోజులిచ్చారు.
దీంతో ఇద్దరి మధ్య బాగా సన్నిహిత్యం ఉందని, వీరి లవ్ కన్ఫమ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక దీనిపై ఇప్పటి వరకు అటు తమన్నా గానీ, ఇటు విజయ్ వర్మ గానీ స్పందించకపోవడం గమనార్హం. వారిద్దరూ సైలెంట్ గా ఉండటంతో సంథింగ్ సంథింగ్ పక్కా అంటూ అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే నెట్టింట వారిద్దరి లవ్ అటు బాలీవుడ్ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కొనసాగుతుండగా.. తాజాగా ఇలా ఈవెంట్ కు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. రెడ్ కార్పెట్ పై చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం.. ఒకరితో ఒకరు బాగా క్లోజ్ గా ఉండటం ఆసక్తికరంగా మారింది.
ఇక తమన్నా బ్లూ టైట్ ఫిట్ లో క్లీవేజ్ షోతో, థైస్ అందాలతో కండ్లు పేలిపోయే అందాలను ప్రదర్శించింది. బ్లాక్ డ్రెస్ లో విజయ్ అట్రాక్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు కూడా పలు రకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా ‘బబ్లీ బౌన్సర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటు తెలుగులో మిల్క్ బ్యూటీ నటించిన ‘శీతాకాలం’ కూడా విడుదలై ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘భోళా శంకర్’లో నటిస్తోంది. హిందీలో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి.