పెళ్లికి ఓ కండీషన్ పెట్టిన హీరోయిన్ శ్రీదివ్య...? అది సాధ్యమయ్యేపనేనా...?
హీరోయిన్ శ్రీదివ్య పెళ్ళి చేసకోబోతుందా..? పెళ్ళికోసం ఆమె కొన్ని కండీషన్లు పెట్టిందా..? ఇంతకీ ఎవరిని చేసుకోబోతోంది. ఎప్పుడు పెళ్ళి చేసుకుంటానని చెప్పింది..?
sri divya
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసింది శ్రీదివ్య.. అచ్చ తెలుగు అమ్మాయి శ్రీదివ్య హనుమాన్ జంక్షన్, యువరాజు, వీడే సినిమాల్లో ఆమె బాల నటిగా అద్భుతంగా నటించింది. దర్శకుడు రవిబాబు శ్రీదివ్యను హీరోయిన్ గా పరిచయం చేశాడు. మనసారా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది బ్యూటీ.
sri divya
తెలుగులో సినిమాలు చేస్తున్న టైమ్ లోనే తమిళ అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. వారుతపడతా వలిమార్ సంఘం టైటిల్ తో తెరకెక్కిన తమిళ చిత్రంలో శివ కార్తికేయన్ కి జంటగా నటించింది. ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకోగా తమిళంలో ఆమె ఫేమస్ అయ్యారు.
sri divya
తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీదివ్య.. తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. తెలుగులో అడపాదడపా చేస్తూ వచ్చింది. టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోయిన శ్రీ దివ్య. తమిళంలో మాత్రం క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది .
కాని శ్రీదివ్య కెరీర్ లో 2017 టైమ్ లో సడెన్ గా గ్యాప్ వచ్చింది. పెద్దగా సినిమాలు చేయలేదు. బయట కూడా ఎక్కువగా కనిపించలేదు. సిల్వర్ స్క్రీన్ కి కొన్నేళ్లు దూరమైంది. 2022లో జనగణమన అనే మలయాళ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మళ్లీ కనుమరుగయ్యింది శ్రీదివ్య.
తాజాగా శ్రీదివ్య పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా సార్లు శ్రీదివ్య పెళ్లి వార్తలు వచ్చాయి. అయితే ఆమె మాత్రం పెల్ళి కోసం రకరకాల కండీషన్లు పెడుతున్నట్టు తెలుస్తోంది. సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తుందట శ్రీ దివ్య.. తను అనుకున్న సక్సెస్ అందుకున్న తరువాతే పెళ్ళి చేసుకుంటానని చెప్పిందట.
sri divya
త్వరలో పెళ్లి చేసుకుంటాను కాని.. తాను అనుకున్నది సాధించాకే చేసుకుంటాను అన్నదట. అంతే కాదు.. తాను ప్రేమించిన ప్రియుడిని చేసుకుంటాను అని ఓ సందర్భంలో అన్నారు. దీంతో శ్రీదివ్య ప్రియుడు ఎవరు? ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటుందా? లేక ఆల్రెడీ ప్రియుడు ఉన్నాడా? అని అంతా ఆలోచనలో పడ్డారు.