- Home
- Entertainment
- అప్పుడే హీరోయిన్ శ్రీలీల అన్ని కోట్లు సంపాదించిందా? మైండ్ బ్లాక్ చేస్తున్న డిటైల్స్!
అప్పుడే హీరోయిన్ శ్రీలీల అన్ని కోట్లు సంపాదించిందా? మైండ్ బ్లాక్ చేస్తున్న డిటైల్స్!
శ్రీలీలను అదృష్టం తేనె తుట్టెలా పట్టింది. ఒక్క హిట్ కొట్టిందో లేదో దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఏడాది వ్యవధిలో శ్రీలీల భారీగా సంపాదించినట్లు సమాచారం.

Sreeleela
అమెరికాలో పుట్టిన శ్రీలీల అనుకోని కారణాలతో ఇండియా వచ్చింది. శ్రీలీల మదర్ స్వర్ణలత భర్తతో విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. దాంతో అమెరికా నుండి బెంగుళూరు వచ్చేశారు. శ్రీలీల తల్లి డాక్టర్ అని సమాచారం. ప్రస్తుతం శ్రీలీల ఎం బి బి ఎస్ చదువుతుంది.
Sreeleela
చిన్నప్పటి నుండి శ్రీలీల భరతనాట్యం నేర్చుకుంది. ఆమె ప్రొఫెషనల్ డాన్సర్. పలు వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చింది. కెజిఎఫ్ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ శ్రీలీల మీద ఫోటో షూట్ చేశారట. ఆమె లుక్స్ నచ్చి దర్శకుడు ఏపీ అర్జున్ కిస్ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టింది. ఆ వెంటనే భరాతే అనే చిత్రం చేసింది.
మూడో చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్ళిసందD చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే శ్రీలీల టాలీవుడ్ మేకర్స్ కంట్లో పడ్డారు. ధమాకా మూవీతో ఫస్ట్ హిట్ కొట్టింది. రవితేజకు జంటగా ఆమె నటించిన ధమాకా మంచి విజయం సాధించింది.
రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా శ్రీలీల పోటీ ఇచ్చింది. శ్రీలీల పరిశ్రమలో అడుగుపెట్టాక చాలా మంది హీరోయిన్స్ చాప చుట్టేశారు. ప్రస్తుతం ఎనిమిది తెలుగు తెలుగు చిత్రాలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, భగవంత్ కేసరి, గుంటూరు కారం, విజయ్ దేవరకొండ 12వ చిత్రం, రామ్-బోయపాటి స్కంద, నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఆదికేశవ, అనగనగా ఒక రాజు చిత్రాల్లో నటిస్తోంది.
ఒక్కో చిత్రానికి శ్రీలీల రూ. 2 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. మొన్నటి వరకు కోటి అడిగిన శ్రీలీల దాన్ని డబుల్ చేసింది. కేవలం ఏడాది వ్యవధిలో శ్రీలీల రూ. 10 నుండి 15 కోట్ల రూపాయల వరకు సంపాదించారట. కేవలం 22 ఏళ్ల ప్రాయంలో అన్ని కోట్ల సంపాదన అంటే మామూలు విషయం కాదు.
ఉస్తాద్ భగత్ సింగ్ క్యాన్సిల్ అయినట్లు సమాచారం. అయితే నితిన్-వెంకీ కుడుముల మూవీ నుండి రష్మిక మందాన తప్పుకోవడంతో శ్రీలీలను తీసుకున్నారట. మహేష్ తో చేస్తూ చేస్తున్న గుంటూరు కారం హిట్ అయితే శ్రీలీల రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆమె రెమ్యూనరేషన్ నాలుగు కోట్లు అయినా ఆశ్చర్యం లేదు.