MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ముద్దులకు భయపడి ఆ ఇండస్ట్రీని వదిలేసిన సోనమ్ బజ్వా, టాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

ముద్దులకు భయపడి ఆ ఇండస్ట్రీని వదిలేసిన సోనమ్ బజ్వా, టాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

హీరోయిన్ గా మంచి ఫామ్ లో కి వస్తున్న టైమ్ లో ఒక ఇండస్ట్రీని వదిలిపెట్టేసింది హీరోయిన్ సోనమ్ బజ్వా. తన అందాలతో బాలీవుడ్ లో అద్భుతం  చేసిన  బ్యూటీ.. పంజాబీ సినిమాలకే పరిమితం అయ్యింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 02 2023, 08:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image: Sonam Bajwa/Instagram

Image: Sonam Bajwa/Instagram

బాలీవుడ్ తో పాటు.. తెలుగు, తమిళ, సినిమాల్లో కూడా నటించి మెప్పించింది స్టార్ బ్యూటీ సోనమ్ బజ్వా. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు హీటు పుట్టించిన ఈ బ్యూటీ. ప్రస్తుతం ఎక్కువగా పంజాబి సినిమాలు చేసుకుంటూ.. బాలీవుడ్ ను అసలుకే వదిలేసింది. ఇక సౌత్ లో కూడా పెద్దగా కనిపించడం లేదు బ్యూటీ. 

26

తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన బాబు బంగారం సినిమాలో ఓ సాంగ్ లో మెరిసిన బ్యూటీ.. సుశాంత్ హీరోగా వచ్చిన ఆటాడుకుందాం రా సినిమాలో నటించింది. ఈరెండు సినిమాలు హిట్ అవ్వకపోయే సరికి.. తమిళంలో ట్రై చేసి.. ఇక సౌత్ ముఖం కూడా చూడలేదు బ్యూటీ. ఇకబాలీవుడ్ లో అయినా కుదురుగా ఉందా అంటే.. అక్కడ కూడా నిలవలేదు సోనమ్ కాలు. వెంటనే పంజాబ్ కు షిష్ట్ అయ్యింది. 

36

హిందీలో కూడా కేవలం రెండు సినిమాలు మాత్రమే అయ్యింది బ్యూటీ.. ఈ రెండు సినిమాల తర్వాత కూడా ఆమెకు హిందీలో చాలా అవకాశాలు వచ్చాయి. కాని సోనమ్ బాలీవుడ్ సినిమాలు చేయడానికి భయపడింది. అయితే ఈమె ఇలా భయపడటానికి ఓ కారణం కూడా ఉంది. చాలా వరకు హిందీ సినిమాల్లో లిప్‌లాక్‌ సీన్లు ఉంటాయి. అయితే ఇలా  ముద్దు సీన్లలో నటించటం సోనమ్ కు  నచ్చలేదు. అందుకే వచ్చిన అవకాశాలను వద్దనుకున్నారు. 

46

అయితే ఇలా ముద్దు సీన్లలో నటించటం ద్వారా ఆమె తన కుటుంబం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న కారణంతో ఆమె తన అవకాశాలను వదులుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో ఆమె ఆమె మాట్లాడుతూ.. నా సినిమాలు నా ఫ్యామిలీ చూస్తుందన్న స్ప్రహ ఉంది. అందుకే నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ముద్దు సీన్లలో నటించడానికి చాలా భయపడేదాన్ని.

56

దాన్ని నా వాళ్లు ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. నా కుటుంబం దాన్ని ఓ సినిమా మాత్రమే అని అర్థం చేసుకోగలదా? ఇలాంటి చాలా ప్రశ్నలు నా బుర్రలో ఉండేవి. అందుకే చాలా హిందీ సినిమాలు వదలుకున్నాను అని అన్నారు సోనమ్. ఇక  సోనమ్‌ బజ్వా 2013లో వచ్చిన బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ అనే పంజాబీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 
 

66
Sonam Bajwa

Sonam Bajwa

ప్రస్తుతం పంజాబీ సినిమాలకు.. అది కూడా పద్దతిగా ఉన్న సినిమాలకు మాత్రమే ఆమె పనిచేస్తున్నారు. ఇక ఆమె హీరోయిన్‌గా నటించిన ‘కప్పల్‌’ అనే తమిళ కామెడీ సినిమా తెలుగులో పాండవుల్లో ఒకడుగా డబ్‌ అయి రిలీజైంది. ప్రస్తుతం పంజాబ్ లో స్టార్ హీరోయిన్ హోదాలో ఉంది సోనమ్. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Khushbu Sundar Weight Loss: ఖుష్బూ చెప్పిన ఈ పనిచేస్తే చాలు మీరు ఏనుగులా ఉన్నా సరే దెబ్బకి స్లిమ్‌ అయిపోతారు
Recommended image2
Raghavendra Raoకి మాటిచ్చి ఆ కోరిక తీర్చకుండానే వెళ్లిపోయిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Recommended image3
Most Expensive Songs: ఇండియన్ సినిమాలో 8 ఖరీదైన పాటలు.. నెం.1 అమీర్, షారుఖ్ కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved