Dharmendra: బాలీవుడు నటుడు ధర్మేంద్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన అనారోగ్యంపై వస్తోన్న రూమర్లపై కూతురు ఇషా స్పందించారు. ఆమె ఈ వార్తలను ఖండించారు.
తీవ్ర అస్వస్థలో బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర
ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర(89) తీవ్ర అస్వస్థకు గురయ్యారు. నిన్న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయన్ని వెంటిలేటర్‌పై ఉంచారు. చాలాకాలంగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు.
రొటీన్ చెకప్ కోసం వెళ్లి
దాదాపు 11 రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. సోమవారం ఆయనను వెంటిలేటర్‌పై ఉంచినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతూ వచ్చారు. అక్టోబర్ 31న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ధర్మేంద్రను ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్చారు. ఆ సమయంలో కూడా ఆయన రొటీన్ చెకప్ కోసం వెళ్లారని అన్నారు. కానీ మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్టు బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. సోషల్ మీడియాలో అనేక మంది ధర్మేంద్ర మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
నాన్న చనిపోలేదుః ధర్మేంద్ర కూతురు పోస్ట్
ఇదిలా ఉంటే ధర్మేంద్ర మరణ వార్తలపై ఆయన కూతురు ఇషా స్పందించారు. తన తండ్రి చనిపోలేదని తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, తప్పుడు వార్తలను ప్రచారం చేయోద్దని, తమ కుటుంబ ప్రైవసీని కాపాడాలని తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీనికి సంబంధించిన మరింత స్పష్టత రావాల్సి ఉంది. ధర్మేంద్రకి భార్య, నటి హేమమాలిని, కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కూతురు ఇషా ఉన్నారు.
