బాబోయ్ శృతి హాసన్ కి ఏమైంది... అసలు స్టార్ హీరోయిన్ ఫేస్ ఇలానేనా ఉండేది!
శృతి హాసన్ చర్యలు ఊహాతీతం. ఆమె ఎవరికీ అర్థం కారు. మై లైఫ్ మై రూల్స్ యాటిట్యూడ్ మైంటైన్ చేస్తుంది. ఇక ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ కూడా అలానే ఉంటాయి. తాజాగా శృతి షేర్ చేసిన సెల్ఫీలు అభిమానులను కంగారు పుట్టిస్తున్నాయి.
Shruti Haasan
సాధారణంగా హీరోయిన్స్ మేకప్ లెస్, డీగ్లామర్ లుక్ షేర్ చేయడానికి ఇష్టపడరు. అది వాళ్ళ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని భయపడతారు. అయితే శృతి మాత్రం ఐ డోంట్ కేర్ అంటుంది. శృతి తాజాగా కొన్ని వరస్ట్ లుక్స్ షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన జనాలు ఆమెకు ఏమైంది? అసలు ఇది స్టార్ హీరోయిన్ ముఖమేనా అంటున్నారు.
Shruti Haasan
శృతి ఫీవర్, సైనస్ తో బాధపడుతున్నారట. అలాగే ఆమె రుతుస్రావం లో ఉన్నారట. బ్యాడ్ డే,బ్యాడ్ హెయిర్ తో నా సెల్ఫీ ఇలా ఉంటుంది. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారు, ఇష్టపడతారని భావిస్తున్నాను అంటూ సదరు ఫోటోలకు శృతి హాసన్ కామెంట్ జోడించింది.
Shruti Haasan
ఇక శృతి కెరీర్ గాడిలో పడగా ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంది. శృతి హాసన్ ముంబైలో లవర్ శాంతను హజారికతో ఉంటుంది. దాదాపు రెండేళ్లుగా వీరు రిలేషన్ లో ఉన్నారు. శాంతను ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్. ఇతడు శృతి హాసన్ ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్న పలు ఫంక్షన్స్ కి హాజరుకావడం విశేషం. నచ్చిన వారిని కుటుంబ సభ్యులకు పరిచయం చేయడం శ్రుతికి అలవాటు.
Shruti Haasan
కొన్నాళ్లు మైఖేల్ కొర్స్లే అనే లండన్ ప్రియుడితో శృతి ప్రేమాయణం నడిపింది. 2019లో ఆయనతో బ్రేకప్ కాగా... కొంచెం గ్యాప్ ఇచ్చి శాంతనుకి దగ్గరైంది. ఇక పెళ్లి గురించి అడిగే పెద్దగా ఇంట్రెస్ట్ లేదంటుంది. ప్రేమలు ఓకే కానీ పెళ్లి అంటే భయమని ఆమె చెప్పడం విశేషం. దీంతో మరి ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికి కాదా అని ప్రశ్నిస్తున్నారు.
Shruti Haasan
ఆమధ్య కెరీర్ పూర్తిగా డల్ అయ్యింది. అనూహ్యంగా క్రేజీ ఆఫర్స్ తో పుంజుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రభాస్ కి జంటగా సలార్ చిత్రం చేస్తుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.
Shruti Haasan
అలాగే బాలయ్య, చిరంజీవి చిత్రాల్లో ఆఫర్స్ కొట్టేసింది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న వీరసింహారెడ్డి మూవీలో శృతి హాసన్ హీరోయిన్. అలాగే చిరంజీవి-బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్యలో కూడా ఛాన్స్ కొట్టేసింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సంక్రాంతి విడుదలకు సిద్ధం అవుతున్నాయి.
వీటిలో సలార్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక శృతికి క్రాక్ మూవీతో హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని చిత్రంపై కూడా పాజిటివ్ బజ్ నడుస్తుంది. ఆమె చేస్తున్న చిత్రాల్లో ఒక్కటి హిట్టైనా నిలదొక్కున్నట్లే. కనీసం సీనియర్ స్టార్స్ పక్కన ఆమెకు అవకాశాలు రావొచ్చు. చూడాలి శృతి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో.