MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • తన డూప్ ని చూసి సావిత్రి షాక్, తెలియని లోపాన్ని తెలుసుకున్న మహానటి!

తన డూప్ ని చూసి సావిత్రి షాక్, తెలియని లోపాన్ని తెలుసుకున్న మహానటి!

డూప్ కారణంగా మహానటి సావిత్రి తనలోని లోపాన్ని తెలుసుకుందట. ఆ నిజం తెలిశాక ఆమె ఒకింత షాక్ అయ్యారట. ఇంతకీ సావిత్రి గుర్తించిన ఆ లోపం ఏమిటో తెలుసా.. 

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 19 2024, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీనేజ్ కూడా దాటకుండానే సావిత్రి సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. 17 ఏళ్ల వయసులో సావిత్రి తన మొదటి చిత్రంలో నటించింది. చిన్న వయసు కావడంతో సావిత్రి చాలా సన్నగా ఉండేవారు. దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్ చిత్రాల్లో సావిత్రి సన్నగా, నాజూగ్గా ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

60-70లలో సావిత్రి క్రేజ్ పీక్స్ కి చేరింది. స్టార్ హీరోలకు మించిన రెమ్యూనరేషన్ ఆమె తీసుకునేవారు. తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. జెమినీ గణేషన్ ని సావిత్రి రహస్య వివాహం చేసుకుంది. అనంతరం వీరి బంధం బహిర్గతం అయ్యింది. 

36

స్టార్ డమ్ పెరిగే కొద్దీ సావిత్రి బిజీ అయ్యారు. అలాగే సావిత్రి ఆహార ప్రియురాలు అని సమాచారం. దాంతో సావిత్రి బరువు పెరుగుతూ పోయారు. కానీ ఈ విషయం ఆమెతో ఎవరు చెప్పలేదు. స్టార్ హీరోయిన్ కావడంతో ఆ సాహసం చేసి ఉండదు. కానీ తాను లావైన విషయాన్ని సావిత్రి ఒకరోజు స్వయంగా తెలుసుకుందట. 

ఒక మూవీ షూటింగ్ జరుగుతుండగా... సెట్ లో తనలాగే కాస్ట్యూమ్స్ ధరించిన ఓ లావాటి మహిళ అటుగా వెళుతుందట. సావిత్రి ఆమెను చూసి.. ఎవరని తన పక్కన ఉన్న వాళ్ళను అడిగారట. ఆమె మీ డూప్ మేడం. ఇవాళ నైట్ మొత్తం షూట్ ఉంది. మీ లాంగ్ షాట్స్ ఆమెతో చేస్తున్నాం, అన్నారట. ఆ మాటలకు సావిత్రి ఒకింత షాక్ అయ్యారట. తన డూప్ ని చూసి నేను ఇంత లావుగా ఉన్నానా అని ఆశ్చర్యపోయిందట. 

46

డూప్ లు సదరు హీరో లేదా హీరోయిన్ కి ఎత్తు, లావు వంటి విషయంలో చాలా దగ్గరగా ఉంటారు. అలా దగ్గరి పోలికలు ఉన్నవాళ్లనే డూప్ గా ఉపయోగిస్తారు. నా డూప్ అంత లావుగా ఉందంటే.. నేను లావుగా ఉన్నాననే అర్థం. అందుకే తన డూప్ భారీ కాయంతో ఉందని సావిత్రి గుర్తించింది అట. 

56
Savitri

Savitri

సావిత్రి రోజుల్లో హీరోయిన్స్ అందరూ దాదాపు బొద్దుగా ఉండేవారు. జీరో సైజ్ కల్చర్ అప్పుడు లేదు. సహజంగా ఒకరిద్దరు హీరోయిన్స్ సన్నగా ఉండేవారు. అందం కంటే ప్రేక్షకులు నటనకు ప్రాధాన్యత ఇచ్చేవారు. హీరోయిన్స్, హీరోలు ఎలా ఉన్నా అంగీకరించేవారు. ఇక ఫేమ్ కోల్పోయాక సావిత్రి మరింత లావయ్యారు. చనిపోయే నాటికి సావిత్రి క్యారెక్టర్ రోల్స్ కి పడిపోయారు. 

 

66
Savitri

Savitri

ఇక నటిగా వైభవం అనుభవించిన సావిత్రి చివరి రోజుల్లో దుర్భర జీవితం చూశారు. దాదాపు 19 నెలలు కోమాలో ఉన్న సావిత్రి అనంతరం కన్నుమూశారు. ఆమె జీవితం ఆధారంగా మహానటి టైటిల్ తో విడుదలైన చిత్రం భారీ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. కీర్తి సురేష్ మహానటి చిత్రంలో సావిత్రి పాత్ర చేసింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved