Sameera Reddy: అవి పెద్దగా కనిపించాలని ప్యాడ్స్ వాడాను, సర్జరీకి సిద్దమయ్యాను!
కెరీర్ తొలినాళ్ళలో ఎదురైన చేదు అనుభవాలు సమీరా రెడ్డి గుర్తు చేసుకుంది. తన బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉందని ఎగతాళి చేశారని, అందుకు సర్జరీ చేయించుకోవాలని అనుకున్నానంటూ కీలక కామెంట్స్ చేసింది.
తెలుగు మూలాలున్న సమీరా రెడ్డి ముంబైలో పుట్టి పెరిగింది. మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. హిందీ చిత్రం మైనే దిల్ తుజ్కో దియా తో వెండితెరకు పరిచయం అయ్యింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం నరసింహుడు.
ఎన్టీఆర్-బి గోపాల్ కాంబోలో తెరకెక్కిన నరసింహుడు అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజయం చవి చూసింది. అనంతరం చిరంజీవికి జంటగా జై చిరంజీవ చిత్రం చేసింది. ఈ మూవీ ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మూడో చిత్రం అశోక్.
ఎన్టీఆర్ తో రెండోసారి అమ్మడు జతకట్టింది. అశోక్ కూడా పెద్దగా ఆడలేదు. దానికి తోడు ఎన్టీఆర్, సమీరా మధ్య ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. వీరి వ్యవహారం పెళ్లి వరకు వెళ్లిందని కథనాలు వెలువడ్డాయి. కారణం తెలియదు కానీ సమీరా రెడ్డి టాలీవుడ్ కి దూరం అయ్యింది.
2014లో సమీరా రెడ్డి పెళ్లి చేసుకుని నటనకు గుడ్ బై చెప్పింది. ఆమెకు ఒక కొడుకు, కూతురు సంతానం. తాజా ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి కెరీర్ బిగినింగ్ లో ఎదురైన అనుభవాలు గుర్తు చేసుకుంది. ఆమె బాడీ షేమింగ్ కి గురయ్యారట. బ్రెస్ట్ సైజ్ మీద నెగిటివ్ కామెంట్స్ చేశారట.
సమీరా రెడ్డి మాట్లాడుతూ... అప్పట్లో నా బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉందని ఎగతాళి చేశారు. సర్జరీ చేయించుకోమని కొందరు సలహా ఇచ్చారు. ఈ కామెంట్స్ నాపై ఒత్తిడికి కారణం అయ్యాయి. దీనిపై నేను సమాచారం సేకరించడం మొదలుపెట్టాను. ఒక దశలో సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. మరలా మనసు మార్చుకున్నాను.
సినిమాల్లో బ్రెస్ట్ సైజ్ పెద్దదిగా కనిపించడానికి ప్యాడ్స్ వాడేదాన్ని. ఒకవేళ నేను సర్జరీ చేయించుకుని ఉంటే సంతోషంగా ఉండేదాన్ని కాదు. అందుకే సర్జరీ చేయించుకోవాలని ఎవరికీ సూచించను... అని సమీరా చెప్పుకొచ్చారు. సమీరా చివరిగా తెలుగులో కృష్ణం వందే జగత్ గురుమ్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది.