Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అక్కడ షేప్ అండ్ సైజ్ కావాలట... జిమ్ లో తెగ కష్టపడుతున్న సమంత, మరీ వందసార్లా!

అక్కడ షేప్ అండ్ సైజ్ కావాలట... జిమ్ లో తెగ కష్టపడుతున్న సమంత, మరీ వందసార్లా!

సమంత ఫిట్నెస్ ఫ్రీక్. కస్టపడి జీరో సైజ్ రాబట్టింది. ఈ స్టార్ లేడీ శరీరంలో ఓ పార్ట్ ని పెంచేందుకు తెగ కష్టపడుతుంది. దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసింది.

Sambi Reddy | Published : Jun 07 2023, 09:56 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Samantha

Samantha

అందంగా ఉన్నంతకాలమే హీరోయిన్స్ కి డిమాండ్. ఒకసారి షేప్ అవుట్ అయితే మేకర్స్ పట్టించుకోరు. ప్రేక్షకులు సైతం పెదవి విరుస్తారు. అందుకే తారలు కష్టనష్టాల కోర్చి స్లిమ్ గా కనిపిస్తారు. అందుకు గంటల తరబడి వ్యాయామం చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. ఈ విషయంలో సమంత మరీ పర్టిక్యులర్. సమంత జీరో సైజ్ ప్యాక్ కోసం ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేస్తారు.

26
Samantha

Samantha

తాజాగా ఆమె ఓ వర్క్ అవుట్ వీడియో షేర్ చేశారు. అందులో ఆమె కాఫ్ మజిల్స్(కాలి పిక్కలు) పెంచేందుకు ఓ కఠిన ఎక్స్ర్సైజ్ చేశారు. ఆది కూడా వంద రిపీట్స్ అట. వందసార్లు పూర్తి కాగానే బాధతో అల్లాడిపోయింది. ఆ వీడియో వైరల్ గా మారింది. కాఫ్ మజిల్స్ షేప్, సైజ్ కోసం సమంత ఆ స్థాయిలో కష్టపడుతున్నారు.

36
Samantha

Samantha

అందం కోసమే కాదు నిరంతరం శ్రమించేందుకు కూడా హీరోయిన్స్ కి ఫిట్నెస్ ఉండాలి. అందుకే సమంత ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యారు. ఇక సమంత ఎంత హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్ అనేది తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సిటాడెల్ యాక్షన్ సిరీస్ కోసం సమంత కఠినతరమైన స్టంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య రెండు చేతులకు గాయాలైన ఫోటోలు సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి ఇంత కష్టపడుతున్న సమంతకు సిటాడెల్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. 
 

46
Samantha

Samantha


సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేశారు. దాని ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ కి ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.  వరుణ్ ధావన్-సమంత ప్రధాన పాత్రలు చేస్తున్నారు. సమంత-వరుణ్ మధ్య బోల్డ్ సన్నివేశాలు ఉంటాయనే ప్రచారం జరుగుతుండగా లేదని యూనిట్ క్లారిటీ ఇచ్చింది. 

56
Vijay Deverakonda Samantha

Vijay Deverakonda Samantha


అలాగే సమంత విజయ్ దేవరకొండకి జంటగా ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. ఖుషి చిత్రీకరణ చివరి దశకు చేరింది. సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత మజిలీ చిత్రం చేశారు. అది సూపర్ హిట్ కొట్టింది.

66
Asianet Image


ఇక శాకుంతలం మూవీతో సమంతకు భారీ షాక్ తగిలింది. సమంత కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా శాకుంతలం నిలిచింది. దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. శాకుంతలం మూవీతో దిల్ రాజు పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories