Samantha: సమంత డ్రెస్ ధర చూసి నోరెళ్ళ బెడుతున్న నెటిజెన్స్... ఒక్కరోజు సంబరానికి!
వెకేషన్ లో సమంత ధరించి ఓ డ్రెస్ హాట్ టాపిక్ అయ్యింది. దాని ధర చూసి నెటిజెన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్కరోజు సంబరానికి అంత ఖర్చు చేసిందా అంటున్నారు.
samantha
సమంత ఇండియాలోని టాప్ హీరోయిన్స్ లో ఒకరు. సినిమాకు నాలుగైదు కోట్లు తీసుకుంటుంది. ఇక యాడ్స్, ప్రొమోషన్స్ మరి కొంత ఆదాయం రాబడుతుంది. మరి ఇంత సంపాదన కలిగిన సమంత అదే రేంజ్ లో మైంటైన్ చేస్తుంది. సమంత ధరించి ఓ డ్రెస్ ధర టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయ్యింది.
samantha
సమంత ప్రస్తుతం బాలీలో ఉంది. వెకేషన్ లో భాగంగా ఇండోనేషియా వెళ్ళింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సందర్భానికి ప్రాంతానికి తగ్గట్లు బట్టలు ధరించడం చాలా అవసరం. లేదంటే ఫ్యాషన్ సెన్స్, కామన్ సెన్స్ లేదంటారు. సెలబ్రిటీ కాబట్టి మరింత పర్టిక్యులర్.
Samantha
బాలీ ద్వీపంలో సమంత గ్రీన్ కలర్ ట్రెండీ వేర్ ధరించారు. సదరు డ్రెస్ నెటిజెన్స్ ని ఆకర్షించిన నేపథ్యంలో వివరాలు సేకరించారు. ఇక ఆ డ్రెస్ ధర రూ. 37790 అట. చూసేందుకు చాలా సింపుల్ గా ఉన్న ఆ డ్రెస్ ఖరీదు అంతా అని నోరెళ్ళ బెడుతున్నారు. ఒక్కరోజు సంబరానికి సమంత అంత డబ్బు ఖర్చు చేశారా అని వాపోతున్నారు.
సమంత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఇటీవల ఆమె ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ పూర్తి చేశారు. గత ఏడాది సమంత ఈ రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. ఖుషి షూటింగ్ సమంత అనార్యోగం బారిన పడటంతో ఆగిపోయింది. మయోసైటిస్ సోకినట్లు ప్రకటించిన సమంత నెలల పాటు ఇంటికి పరిమితమయ్యారు. కొంతమేర కోలుకున్న సమంత తిరిగి నటించడం స్టార్ట్ చేశారు. మిగిలి ఉన్న ఖుషి చిత్రీకరణ పూర్తి చేశారు. ద్రాక్షారామంలో విజయ్ దేవరకొండ-సమంత మీద పతాక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది.
ఇక జులై 13న సిటాడెల్ షూట్ కూడా కంప్లీట్ చేసింది. ఆరు నెలలు కష్టంగా గడిచాయని సమంత తెలియజేశారు. ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ లో నిరవధికంగా పాల్గొన్న సమంత కష్టం మీద ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినట్లు పరోక్షంగా వెల్లడించారు. కాగా ఏడాది పాటు సమంత విరామం తీసుకోనున్నారట. సమంత ఎలాంటి ప్రాజెక్ట్స్ కి సైన్ చేయకూడదని నిర్ణయించుకున్నారట.
ఏడాది కాలాన్ని ఆమె చికిత్స కోసం కేటాయించనున్నారని సమాచారం. అందుకు సమంత అమెరికా వెళుతున్నారట. అక్కడే కొన్ని నెలల పాటు ఉంటారట. సమంత వైద్యానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుందట. సమంత చికిత్స కోసం అమెరికా వెళుతున్న మాట నిజమేనా అనే సందేహాలు ఉన్నాయి. ఆమె మిత్రుడు హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ బత్కర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. పరోక్షంగా నిజమే అని తెలియజేశాడు.