సమంతకు ఆయుర్వేద చికిత్స, ఎక్కడ తీసుకుంటుందంటే..?
సినిమాలకు బ్రేక్ ఇచ్చి తనవ్యాధికిట్రీటెమ్మెట్ తీసుకుంటుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. చాలా కాలంగా మయోసైటిస్ తో బాధ పడుతున్నసీనియర్ బ్యూటీ.. తన ట్రీటమ్మెంట్ లో రకరకాల థెరపీలను ట్రై చేస్తోంది. తాజాగా ఆమెకు ఆయుర్వేద చికిత్స జరిగినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సమంత. తన సొంత కాళ్ల మీద నిలబడింది బ్యూటీ. టాలీవుడ్ లో సమంతది దాదాపు 20 ఏళ్ళ ప్రయాణం. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో సమంత పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్ది తన గ్లామర్ ను కూడా పెంచుకుంటూ పోతోంది.
Samantha
నాగచైతన్యతో ప్రేమ.. పెళ్ళి.. విడాకులు.. ఇలా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా.. సింగిల్ హీరోయిన్ గా జీవితాన్నినెట్టుకొస్తోంది. ఏ విషయంలో భయపడకుండా సాగిపోతోంది సమంత.రీసెంట్ గా సినిమాలకు విరాపం ప్రకటించింది సమంత, ఏడాది పాటు సినిమాలు ముట్టుకోకుండా తను ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల నుంచి ముందు దూరంఅవ్వాలి అని ట్రీట్మెంట్ తీసుకుంటుంది.
మయోసైటిస్ తో భాదపడుతున్న ఆమె.. షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి ఖాళీ టైమ్ లో ఎంజాయ్ చేస్తోంది. అటు ట్రీట్మెంట్ .. ఇటు దేశ విదేశాల్లోకి టూర్లు.. రెండూ కవర్ చేస్తూ.. సాగిపోతోంది బ్యూటీ. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర్నుంచి సమంత కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్, బాలి, అమెరికా, ఆస్ట్రియా, ఇటలీ.. లాంటి పలు ప్రదేశాలు తిరిగింది.
తాజాగా తన ట్రీట్మెంట్ లో భాగంగా.. ఆయుర్వేదం ట్రై చేసింది బ్యూటీ. ప్రతి చోట ఏదో ఒక ప్రకృతి వైద్యం, కొత్త రకాల వైద్యం కూడా ట్రై చేసింది సమంత. ఇటీవలే క్రయోథెరపీ అనే ట్రీట్మెంట్ ను తీసుకున్నసమంత.. తాజాగా ఆయుర్వేద చికిత్స కోసం సమంత భూటాన్ వెళ్ళింది. భూటాన్ లో సరికొత్త ఆయుర్వేదం చికిత్స ట్రై చేస్తుంది సమంత సీనియర్ బ్యూటీ.
భూటాన్ ఆయుర్వేదంలో హాట్ స్టోన్ బాత్ అనే ఓ చికిత్సను సమంత తీసుకుంటుంది. దానికి సమందించిన ఫొటోలు, వీడియోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తుంది.ఇక భూటాన్ లో సమంత ఈ ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటూనే మరో పక్క అక్కడి చేనేత పరిశ్రమలు, అక్కడి ప్రకృతి ప్రదేశాలు, బుద్ధుడి ఆలయాలు సందర్శిస్తుంది. ఇలా దేశాలు తిరిగేస్తున్న సమంత భూటాన్ తర్వాత ఏ దేశం వెళ్తుంది చూడాలి.