MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెండేళ్లు వెంటపడ్డాడు, అదే నా ఫస్ట్ లవ్... చైతు కంటే ముందు అతన్ని ప్రేమించిన సమంత!

రెండేళ్లు వెంటపడ్డాడు, అదే నా ఫస్ట్ లవ్... చైతు కంటే ముందు అతన్ని ప్రేమించిన సమంత!

సమంత మొదటిసారి తన ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ అయ్యింది. నాగ చైతన్య కంటే ముందే ఆమె ఒకరిని ప్రేమించింది అట. ఆ వ్యక్తి ఎవరో రివీల్ చేసింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 02 2024, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సమంత మొదటి చిత్రం ఏమాయ చేసావే. దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. నాగ చైతన్య రెండో చిత్రం కాగా ఆయనకు మొదటి హిట్ అని చెప్పాలి. సినిమాలో నాగ చైతన్య-సమంత కెమిస్ట్రీ అదుర్స్. జంట చాలా ఫ్రెష్ గా అనిపించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఆ మూవీ సెట్స్ లో నిజంగానే ప్రేమలో పడిపోయారు. చాలా కాలం రహస్యంగా వారి ప్రేమాయణం సాగింది. మరోవైపు సమంత స్టార్ గా ఎదుగుతూ వచ్చింది. సమంత కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లి చేసుకుంది. నాగ చైతన్య-సమంతల వివాహం 2014లో గోవాలో ఘనంగా జరిగింది. 

 

37

టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు సమంత-నాగ చైతన్య. ఏమైందో తెలియదు కానీ మనస్పర్థలు తలెత్తాయి. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి 2021లో విడాకులు తీసుకున్నారు. ఈ పరిణామం సమంత, నాగ చైతన్య అభిమానులను బాధపెట్టింది. ప్రస్తుతం ఎవరి కెరీర్లో వారు బిజీగా ఉన్నారు. 

47

అయితే సమంతకు నాగ చైతన్యతో ఫస్ట్ లవ్ కాదట. అంతకు ముందే ఆమె ఒకరిని ప్రేమించిందట. ఇటీవల సదరు లవ్ స్టోరీ బయట పెట్టింది. సమంత చదువుకునే రోజుల్లో పల్లవరం నుండి టీనగర్ వెళ్ళడానికి రెండు బస్సులు మారాల్సి వచ్చేదట. ఒక అబ్బాయి రోజూ సమంత కోసం బస్ స్టాప్ వద్ద వెయిట్ చేసేవాడట. 

57

సమంతను స్కూల్ వరకు ఫాలో అయ్యేవాడట. ఎప్పుడూ దగ్గరకు రాలేదట. కొన్ని అడుగుల దూరం లో ఉంటూ అనుసరించేవాడట. ఇంటర్ కూడా పూర్తి అయ్యిందట. రెండేళ్లుగా ఫాలో అవుతున్న అతని వద్దకు వెళ్లి... ఎందుకు నా వెనకాల పడుతున్నావ్... అని అడిగిందట. నేను నిన్ను ఫాలో కావడం ఏంటీ, అనేశాడట. దాంతో సమంత షాక్ అయ్యిందట. 

 

67

అది ప్రేమో కాదో తెలియదు కానీ... అదే నా ఫస్ట్ లవ్ అని సమంత చెప్పుకొచ్చింది. సమంత మాటలను బట్టి చూస్తే సమంత కూడా అతన్ని ఇష్టపడింది. కానీ ఆ పిరికివాడు ధైర్యం చేయలేదు. అదన్నమాట సంగతి. 

77


కొన్నాళ్లుగా మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత చిత్రాలు తగ్గించారు. ఆమె చివరి చిత్రం ఖుషి కాగా మరో ప్రకటన చేయలేదు. సమంత నటించిన యాక్షన్ సిరీస్ సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. త్వరలో సిటాడెల్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది... 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Recommended image2
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు
Recommended image3
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved