Samantha: ముంబైలో అలా మెరిసిన సమంత... ఆమెలోని ఈ కామన్ పాయింట్ గమనించారా?
సమంత ముంబైలో సందడి చేశారు. శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా ఆమె అక్కడకు వెళ్లారు. యూనిట్ సభ్యులతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు.

Samantha
సమంత శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. శాకుంతలం పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కానుంది. దీంతో ఇండియాలోని ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు .
Samantha
సమంత శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. శాకుంతలం పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కానుంది. దీంతో ఇండియాలోని ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు .
Samantha
ముంబై ఈవెంట్ కోసం సమంత వైట్ కోట్ అండ్ ప్యాంట్ ధరించారు. శాకుంతలం ప్రమోషన్స్ లో సమంత ఓ కామన్ పాయింట్ ఫాలో అవుతున్నారు. ఆమె తెల్లని దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఎక్కువగా వైట్ శారీలలో సమంత దర్శనమిస్తున్నారు. ముంబై ఈవెంట్ కావడంతో కొంచెం ట్రెండీగా సిద్ధమయ్యారు.
Samantha
శాకుంతలం ముంబై ప్రమోషనల్ ఈవెంట్లో దర్శకుడు గుణశేఖర్, నిర్మాత దిల్ రాజు, హీరో దేవ్ మోహన్, నీలిమ గుణ హాజరయ్యారు. సమంత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆమె ఫోటోలు తీసేందుకు మీడియా ప్రతినిధులు పోటీపడ్డారు.
Samantha
సమంత కెరీర్ లో మొదటిసారి పౌరాణిక చిత్రం చేశారు. శాకుంతలం ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. దీంతో శాకుంతలం చిత్రాన్ని సమంత భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ మూవీని సక్సెస్ చేసే బాధ్యత సమంత తీసుకున్నారు.
Samantha
మరోవైపు వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్లో సమంత పాల్గొంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో జరిగింది. అనంతరం నార్త్ ఇండియాలో చిత్రీకరణ జరిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నైనిటాల్ లో సిటాడెల్ కి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
Samantha
నెక్స్ట్ షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సౌత్ ఆఫ్రికాతో పాటు పలు దేశాల్లో సిటాడెల్ షూట్ జరపనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. భారీ బడ్జెట్ తో సిటాడెల్ తెరకెక్కుతుంది. ఈ సిరీస్లో సమంత బోల్డ్ సన్నివేశాల్లో నటించనున్నారనే ప్రచారం జరుగుతుంది.
Samantha
అలాగే విజయ్ దేవరకొండకు జంటగా నటిస్తున్న ఖుషి చిత్ర చిత్రీకరణ తిరిగి మొదలైంది. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇటీవల కేరళలో ఓ షెడ్యూల్ జరిపారు. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత మజిలో మూవీ చేయగా సూపర్ హిట్ కొట్టింది.