- Home
- Entertainment
- ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన సమంత... ఏముందిరా అంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్
ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన సమంత... ఏముందిరా అంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్
తాజాగా సమంత ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో సోషల్ మీడియాను షేక్ చేసింది. గాగుల్స్, షర్ట్, ప్యాంట్స్ లో స్టైల్ ఐకాన్ లా దర్శనమిచ్చింది. సమంత లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Samantha
తాజాగా సమంత ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో సోషల్ మీడియాను షేక్ చేసింది. గాగుల్స్, షర్ట్, ప్యాంట్స్ లో స్టైల్ ఐకాన్ లా దర్శనమిచ్చింది. సమంత లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Samantha
ఇక సమంత విజయ్ దేవరకొండకి జంటగా ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదల కాగా ఆకట్టుకుంది.
Samantha
ఖుషి చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొనని సమంతను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తప్పుబట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ విమర్శలపై స్పందించిన సమంత... ఇతరుల కోసం బ్రతకొద్దు. మీ స్థాయిని పెంచుకోండి అంటూ పరోక్షంగా చురకలు వేసింది. ఖుషి మూవీ విజయం సాధిస్తుందని సమంత నమ్మకంతో ఉంది.
Samantha
మరోవైపు సిటాడెల్ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సిటాడెల్ కోసం సమంత బాగా కష్టపడింది. కఠిన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంది. ఆమెకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేశారు. దాని ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ కి ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్-సమంత ప్రధాన పాత్రలు చేస్తున్నారు. గతంలో సమంత ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ చేసిన విషయం తెలిసిందే. సిటాడెల్ కెరీర్లో రెండవది.
Samantha
కాగా సమంత ఓ హాలీవుడ్ మూవీకి సైన్ చేశారని సమాచారం. దర్శకుడు ఫిలిప్ జాన్ చెన్నై స్టోరీ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయనున్నారట. వివేక్ కాల్రా హీరోగా నటించనున్న ఈ హాలీవుడ్ మూవీలో చెన్నై అమ్మాయిగా సమంత నటిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
Samantha
అయితే ప్రస్తుతం సమంత విరామంలో ఉన్నారు. ఆమె ఏడాది పాటు సినిమాలు చేయరనే మాట వినిపిస్తోంది. చికిత్స కోసం అమెరికా వెళ్లనున్న సమంత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక శాకుంతలం మూవీతో సమంతకు భారీ షాక్ తగిలింది. సమంత కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా శాకుంతలం నిలిచింది. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.