బాడీ కాన్ డ్రెస్ లో సెగలు రేపుతున్న సమంత... సోషల్ మీడియా షేక్ అయ్యేలా బోల్డ్ లుక్!
స్టార్ లేడీ సమంత బోల్డ్ ఒకటి వైరల్ అవుతుంది. ఓ ఫోటోగ్రాఫర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Samantha
ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైష్ణవ్ ప్రవీణ్ సమంత బోల్డ్ లుక్ ఒకటి షేర్ చేశారు. బాడీ కాన్ డ్రెస్ లో సమంత టూ హాట్ గా ఉంది. ఆమె పోజ్ మరింతగా మనసులు దోచేస్తుంది. ఇది త్రో బ్యాక్ ఫోటో అని తెలుస్తుండగా... ఇంస్టాగ్రామ్ ని షేక్ చేస్తుంది. ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
Samantha
మరోవైపు సమంత ఖుషి చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అమెరికా వెళ్లిన సమంత అక్కడ కూడా ఖుషి చిత్రాన్ని ప్రమోట్ చేస్తుంది. న్యూయార్క్ లో ఖుషి ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి భారీగా ఆదరణ దక్కింది. సమంతను చూసేందుకు యూఎస్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేలకు వేలు ఖర్చు పెట్టి టికెట్స్ కొని మరీ సమంత కోసం వచ్చారు.
ఖుషి మూవీలో సమంత-విజయ్ దేవరకొండ జంటగా నటించారు. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదల కాగా ఆకట్టుకుంది.
సమంత అమెరికా వెళ్లే ముందు హైదరాబాద్ లో మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. దీనికి భారీ రెస్పాన్స్ దక్కింది. వేదిక మీద సమంత విజయ్ దేవరకొండ రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
మరోవైపు సిటాడెల్ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సిటాడెల్ కోసం సమంత బాగా కష్టపడింది. కఠిన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంది. ఆమెకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేశారు. దాని ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు.
Rakul and Samantha
సిటాడెల్ సిరీస్ కి ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్-సమంత ప్రధాన పాత్రలు చేస్తున్నారు. గతంలో సమంత ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ చేసిన విషయం తెలిసిందే. సిటాడెల్ కెరీర్లో రెండవది.
కాగా సమంత ఓ హాలీవుడ్ మూవీకి సైన్ చేశారని సమాచారం. దర్శకుడు ఫిలిప్ జాన్ చెన్నై స్టోరీ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయనున్నారట. వివేక్ కాల్రా హీరోగా నటించనున్న ఈ హాలీవుడ్ మూవీలో చెన్నై అమ్మాయిగా సమంత నటిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.