MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాజీ భార్యకు ప్రాణాంతక వ్యాధి... పట్టింపులు పక్కన పెట్టి సామ్ తో చైతూ మాట్లాడాడా?

మాజీ భార్యకు ప్రాణాంతక వ్యాధి... పట్టింపులు పక్కన పెట్టి సామ్ తో చైతూ మాట్లాడాడా?

మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత సోషల్ మీడియా ప్రకటన చేశారు. అరుదైన ఈ ప్రాణాంతక వ్యాధి సమంతను సోకిందన్న వార్త అభిమానులను, ప్రముఖులను కలచివేస్తుంది. చిరంజీవి, ఎన్టీఆర్ తో పాటు అఖిల్ అక్కినేని సైతం ఆమె కోలుకోవాలంటూ సోషల్ మీడియా పోస్ట్స్ చేశారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 30 2022, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Samantha

Samantha


సమంత జీవితంలో క్లిష్ట సమయం ఇది. ఆమె అరుదైన మయోసైటిస్ వ్యాధికి గురయ్యారు. మయోసైటిస్ వ్యాధిలో ఆటోఇమ్యూన్ రకం ప్రమాదకరమైనదని తెలుస్తుంది. సమంతకు సోకింది ఆ రకమే. దీంతో కొంత ఆందోళన నెలకొంది. 
 

28
Samantha

Samantha


స్టార్ గా చేతినిండా ఆఫర్స్ తో దూసుకెళుతున్న సమంత కెరీర్ కి ఇది పెద్ద బ్రేక్ అని చెప్పాలి. ప్రస్తుతం సమంత హీరోయిన్ గా చేస్తున్న కొన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. చికిత్స తీసుకుంటూనే నిర్మాణాంతర కార్యక్రమాల్లో సమంత పాల్గొంటున్నారు. నవంబర్ 11న యశోద విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్ర డబ్బింగ్ సమంత పూర్తి చేస్తుంది. 

38


ఇక విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషి చిత్రీకరణ జరుపుకుంటుంది. అలాగే ఓ వెబ్ సిరీస్ సెట్స్ పై ఉన్నట్లు సమాచారం. ఈ రెండు ప్రాజెక్ట్స్ డిస్ట్రబ్ అయ్యే సూచనలు కలవు. సమంత కోలుకునే వరకు వారు చేసి చూడాల్సిన పరిస్థితి రావచ్చు. 

48

సమంత మయోసైటిస్ బారినపడటం అందరినీ దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. చిరంజీవి, ఎన్టీఆర్, రకుల్ ప్రీత్, రాశి ఖన్నా, కియారా అద్వానీ ఇలా పలువురు సమంత ఆరోగ్యంపై స్పందించారు. ఆమెకు దైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని విష్ చేశారు. చివరకు అఖిల్ అక్కినేని సైతం కామెంట్ చేశారు. ఈ సమస్యను అధిగమించడానికి కావాల్సిన ప్రేమా, ధైర్యం నీకు కలగాలని కోరుకున్నాడు. 
 

58


ఈ క్రమంలో నాగ చైతన్య ఫీలింగ్ ఏమిటీ? భయంకర వ్యాధి బారినపడిన సమంత గురించి ఆయన ఏమి ఆలోచిస్తున్నాడనే? ఆసక్తి నెలకొని ఉంది. అసలు నాగ చైతన్య స్పందిస్తాడా? ఆమె గురించి ఏదైనా సోషల్ మీడియా పోస్ట్ చేస్తాడా? అనే సందేహాలు మెదళ్లను తొలిచేస్తున్నాయి. 
 

68

విడాకులు తీసుకొని విడిపోయినంత మాత్రాన ప్రేమ చావదు. అందులోనూ నాగ చైతన్య, సమంత ఏళ్ల తరబడి ప్రేమించుకున్నారు. నాలుగేళ్లు కలిసి కాపురం చేశారు. ఎన్నో జ్ఞాపకాలు, తీపి గుర్తులు సమంతతో నాగ చైతన్యకున్నాయి. కాబట్టి సమంత ఆరోగ్యం నాగ చైతన్యను వేదనకు గురి చేయడం ఖాయం. 
 

78

చైతూ సోషల్ మీడియాలో స్పందించకున్నా నేరుగా సమంతతో మాట్లాడే అవకాశం కలదు. నాగ చైతన్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. చాలా అరుదుగా పోస్ట్స్ పెడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో గడపడం నాకు నచ్చని వ్యవహారమని చెప్పాడు. కాబట్టి చైతూ నుండి ఆ తరహా పోస్ట్ ఆశించడం అనవసరం. కాబట్టి సమంతతో ఆయన నేరుగా మాట్లాడే అవకాశం కలదు.

88
Samantha

Samantha

లేదంటే ఆమెకు సందేశం పంపవచ్చు. కాబట్టి సమంత ఆరోగ్యం పట్ల నాగ చైతన్య  ఎలా స్పందించారని తెలుసుకోవడం కష్టమే. సమంతతో చైతూ మాట్లాడినా, మెసేజ్ పంపినా ఆ విషయాలు బయటకు రావు కాబట్టి... విడాకుల రీజన్ లాగా ఈ విషయం కూడా అలా మరుగున దాగి ఉంటుంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Atlee Kumar: ఒక్క ఫ్లాప్ లేదు.. రెండు ఇండస్ట్రీల్లో సంచలనం సృష్టించిన డైరెక్టర్!
Recommended image2
Mangli: శ్రీముఖిపై అతడి కన్ను పడింది, అందుకే నన్ను టార్గెట్ చేశాడు..సింగర్ మంగ్లీ సంచలన ఆరోపణలు
Recommended image3
Anchor Vishnu Priya: వల్గర్ ఫోజులతో డబ్బు సంపాదన, యాంకర్‌పై సైబర్ క్రైమ్ కేసు.. అసలేం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved