విజయ్ దేవరకొండతో అస్సలు నటించనని తెగేసి చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరు..? ఎందుకు..?
ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనతో సినిమా అంటే యంగ్ స్టార్ హీరోయిన్లు కూడా క్యూ కడుతున్నారు. కాని ఓ సౌత్ హీరోయిన్ మాత్రం విజయ్ తో అస్సలు నటించనని చెప్పేసిందట.. ఇంతకీ ఎవరా హీరోయిన్..? ఎందుకలా చేసింది..?
విజయ్ దేవకొండ అంటే ఇష్టపడివారంటూ ఉండరు. జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి... చాలా తక్కువ టైమ్ లోనే తన టాలెంట్ తో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు విజయ్. ఇక ఇప్పుడు విజయ్ అంటే పడి చచ్చిపోతారు ఫాస్స్. అంతే కాదు సౌత్ నుంచి బాలీవుడ్ దాకా.. యంగ్ స్టార్ హీరోయిన్స్ అంతా విజయ్ తో సినిమా కోసం తహతహలాడుతున్నారు.
ఇలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో తో నటించనని ముఖాన తేల్చి చెప్పేసిందట డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ సాయి పల్లవి.లేడీ పవర్ స్టార్ గా ఇండస్ట్రీలో పేరున్న సాయి పల్లవి... తనదైన స్టైల్ లో హీరోయిన్ గా దూకుడు చూపిస్తోంది. తనకు నచ్చితేనే సినిమాను చేస్తుంది. ఎంతటి స్టార్ హీరో సరసన అయినా సరే.. హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తుంది. కథ నచ్చకపోతే ఎంత స్టార్ హీరో అడిగినా నో అనేస్తుంది సాయి పల్లవి.
అయితే ఈ రకంగానే సాయి పల్లవికి విజయ్ దేవరకొండతో నటించే అవకాశం వచ్చిందట.కాని ఈ ఛాన్స్ కు ఆమె నో చెప్పి అందరికి షాకిచ్చింది. డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక మందన్నా కంటే ముందుగా హీరోయిన్ గా సాయి పల్లవినే అనుకున్నారట. కానీ, ఈ సినిమాలో ముద్దు సీన్ ఉండటంతో తాను నటించను అని చేప్పేసిందట.
అంతే కాదు విజయ్ దేవరకొండ గురించి ఆమె ఏమనుకుందో ఏమో కాని.. ఫ్యూచర్ లో కూడా రౌడీ హీరోతో కలిసి నటించను అని సాయి పల్లవి చెప్పినట్టు సమాచారం. అంతే కాదు ఆయన సినిమా చూసింగ్ కి , తన సినిమా చూసింగ్ కి చాలా తేడాలు ఉన్నాయని అన్నదట సాయి. మరి అప్పటికే విజయ్ కి చాలా క్రేజ్ ఉంది. ఇప్పటికి అది రెట్టింపు అయ్యింది. మరి ఇప్పుడైనా ఆమె మనసు మార్చుకుంటుందా..? చూడాలి మరి.
విజయ్ దేవరకొండ పేరు చెప్పితే జనాలు పిచ్చెక్కిపోతుంటారు. ఆయన తెరపైన కనిపిస్తే..పూనకాలతో ఊగిపోతుంటారు.ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా ఎక్కువగా ఉన్న హీరో విజయ్. విజయ్ పేరు పచ్చబొట్టు వేయించుకోవడం.. ఆయన కనిపిస్తే.. ఐలవ్ యులు చెప్పడం కామన్ ఇప్పుడు. ఇక ఈ లిస్ట్ లో చాలా మంది హీరోయిన్లు కూడా ఉన్నారు.
ఇక ప్రస్తుతం లైగర్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలతో ఈమూవీ రిలీజ్ అవ్వబోతోంది. వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ ఈసినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ నెల 25 లైగర్ మూవీ రిలీజ్ కాబోతోంది.