సాయి పల్లవి నో అంటే.. కంగనా రనౌత్ ఓకే చేసింది, చంద్రముఖి2 పై క్రేజీ న్యూస్
చంద్రముఖి గా కంగనా రనౌత్ అనగానే ఆడియన్స్.. ఆమె ఈపాత్రకు కరెక్ట్ అంటూ కామెంట్లు చేశారు. ఇదే పాత్రలో సాయి పల్లవి కనిపిస్తే..? ఇంకా బాగుండేది కదా..? అయితే ఈపాత్రను సాయి పల్లవే చేయాల్సిందట.. మరి ఈ పాత్ర కంగనాను ఎలా చేరింది. సాయి పల్లవి ఎందుకు చేయలేదు...?

హీరోయిన్ పాత్రకు యాక్టింగ్ స్కోస్ ఉండాలి.. అలా లేకుండా..బ్యూటీ క్యారెక్టర్ మాత్రమేఅయితే.. ఆసినిమా ఎంత స్టార్ హీరోది అయినా సరే చేయను అంటుందిసాయి పల్లవి. కాని నటనతో పాటు తనకు ఎంతో ఇష్టమైన డాన్స్ కు ప్రాధాన్యత ఉన్న చంద్రముఖీ2 మూవీని కూడా సాయి పల్లవి రిజక్ట్ చేసిందట ఎందుకు..?
సాయిపల్లవి చేసిన సినిమాలేమో గానీ వదులుకున్న సినిమాలు మాత్రం చాలానే ఉంటాయి. పెద్దపెద్ద సినిమాలను సైతం రిజక్ట్ చేశారామె. గతంలో కూడా ఇలానే సరిలేరు నీకెవ్వరు సినిమా కథతో అనిల్ రావిపూడి వెళ్తే.. హీరోయిన్ పాత్రకు యాక్టింగ్ స్కోప్ లేదంటూ.. రిజక్ట్ చేసిందని టాక్. సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన చేయాలని అమ్మాయిలు కలలు కంటారు. హీరోయిన్లు క్యూలో ఉంటారు. తన కెరీర్ కు ప్లస్అవుతుందని కూడా ఆలోచించకుండా.. రిజక్ట్ చేసిందట.
మొన్నటికి మొన్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా అవకాశం వచ్చినా వద్దని చెప్పేసిందంట. ఇక ఆ సినిమాల వరుసలో ఇప్పడు చంద్రముఖి 2 కూడా చేరిందని తెలిసింది. నిజానికి ఈ సినిమా అనుకున్నప్పుడు దర్శకుడు పి.వాసు చంద్రముఖిగా ఊహించుకుంది సాయిపల్లవినేనంట. చంద్రముఖి నర్తకి కావడం, సాయిపల్లవి లాంటి గొప్ప డాన్సర్ ఆ పాత్ర చేస్తే సినిమాకు ప్లస్ అవుతుంది అని ఆయన అనుకున్నారట. అంతే కాదు..నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో సాయి పల్లవి కూడా ఈ పాత్ర చేస్తుంది అనుకున్నారట.
సాయి పల్లవి చేస్తే.. ఈ సినిమాకు ఎంతో హెల్ప్ అవుతుంది అని వాసు భావించారట. పైగా సాయిపల్లవి కళ్లతోనే అభినయించగల గొప్ప నటి. అందుకే పి.వాసు ఆమె కోసం ప్రయత్నించారు. కానీ ఆమె కథ విని సున్నితంగా తిరస్కరించిందట. అయితే సాయి పల్లవి ఎందుకు ఈ సినిమాను రిజెక్ట్ చేసింది అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
కథ పరంగా, యాక్టింగ్ పరంగా, డాన్స్ పరంగా కూడా చంద్రముఖి పాత్ర మాత్రమే సినిమా అంతట కనిపిస్తుంది. అటువంటి పాత్ర ఎవరికైనా తమను తాము నిరూపించుకోవడం కోసం ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జ్యోతిక చంద్రముఖిగా చేసినప్పుడు ఆమెకు వచ్చి న పేరు అంతాఇంతా కాదు. 20 ఏళ్లు అవుతున్నా.. ఇంకా ఆపాత్ర గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు.
మరి అలాంటి పాత్ర.. ఆ దర్శకుడే.. అయినా కూడా సాయి పల్లవి ఈసినిమాను రిజెక్ట్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇక సాయి పల్లవి ఈ పాత్ర చేయను అని చెప్పడంతో.. చివరకు కంగనారనౌత్ చంద్రముఖి 2 సినిమాకు ఖరారైంది. చంద్రముఖిగా కంగనా అద్భుతంగా కనిపిస్తోంది. ఈపాత్రకు న్యాయం చేయగల సత్త ఆమెకు ఉంది.