MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మగాళ్లు ఇంత అందంగా ఉంటారా... మహేష్ పై సాయి పల్లవి హాట్ ఫీలింగ్ అదే!

మగాళ్లు ఇంత అందంగా ఉంటారా... మహేష్ పై సాయి పల్లవి హాట్ ఫీలింగ్ అదే!

పరిశ్రమలో ఎలాంటి నెగిటివిటీ లేని హీరోయిన్ అంటే బహుశా సాయి పల్లవీనే కావచ్చు. సాయి పల్లవి ఆన్ స్క్రీన్ రోల్స్, ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ అంటే చాలా మంది కి ఇష్టం. అందుకే ఆమె అందాన్ని కాకుండా వ్యక్తిత్వాన్ని, టాలెంట్ ని ఆరాధించే అభిమానులు ఎందరో ఉన్నారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 16 2022, 09:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sai Pallavi

Sai Pallavi

ఈ మధ్య సాయి పల్లవి సినిమాలు తగ్గించడంతో అభిమానులు కొంత నిరాశకు గురి అవుతున్నారు. డిమాండ్ ఉండి కూడా కొత్త చిత్రాలకు సైన్ చేయడం లేదు. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో అధికారికంగా ఒక్క తెలుగు చిత్రం లేదు. కాగా సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 
 

26
Sai Pallavi

Sai Pallavi


ఆమె సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ.. ఫలానా హీరోతో చేయాలనే కోరిక నాకు లేదు. కథ నచ్చితే ఎవరితో అయినా చేస్తాను.మీ  మీకు ఒక స్టార్ హీరో సినిమాలో ఆఫర్ వచ్చిందని చెబితే ఆ హీరో ఎవరని కూడా అడగను. కథ చెప్పమంటాను.  పరిశ్రమలో ఉన్న హీరోలందరి పై నాకు గౌరవం ఉంది. అల్లు అర్జున్ డాన్స్ ని బాగా ఇష్టపడతాను. ఇక మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చుతుంది. ఆయన్ని చూశాక... మగాళ్లు ఇంత అందంగా ఉంటారా! అనిపించిందని సాయి పల్లవి వెల్లడించారు. 

36
Sai Pallavi

Sai Pallavi


నేను ప్యూర్ వెజిటేరియన్. అన్నం, పప్పు ఉంటే చాలు ఇంకా ఏమీ అడగను. సెట్లో కూడా కొబ్బరి నీళ్లు, మజ్జిగతో సరిపెట్టుకుంటాను. అసలు వ్యాయామం చేయను.అప్పుడప్పుడు అమ్మతో బ్యాడ్మింటన్ ఆడతాను. నేను త్వరగా బరువు పెరగనని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. అలాగే సోషల్ మీడియా అంటే పడదన్న సాయి పల్లవి, అదో టైం వేస్ట్ వ్యవహారం అని కొట్టిపారేసింది. 
 

46
Sai Pallavi

Sai Pallavi

పరిశ్రమకు వచ్చిన కొత్తలో అనేక అనుమానాలు ఉన్నాయి. నేను అందంగా ఉండను, ముఖంపై మొటిమలు ఉంటాయి. హీరోయిన్స్ అంటే చాలా అందంగా ఉంటారు. నేను పరిశ్రమలో రాణించగలనా అనే అనేక సందేహాలు వెంటాడాయి. ప్రేమమ్ మూవీ సమయంలో కూడా అదే సందేహాలు వెంటాడేవి. అనేకమార్లు దర్శకుడిని మధ్యలో తీసేయరు కదా అని అడిగేదాన్ని. ప్రేమమ్ దర్శకుడు నాలో విశ్వాసం నింపారు, అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు.

56

నటన, డాన్స్ నేర్చుకోలేదు. చిన్నప్పుడు భరతనాట్యం క్లాసులకు పంపారు. ఒకే స్టెప్ వారం రోజులు నేర్పారు. నాకు వచ్చేసింది, కొత్త స్టెప్ నేర్పమన్నాను. ఇదే స్టెప్ నెలరోజులు ప్రాక్టీస్ చేయాలి అన్నారు. దాంతో నాట్యం నేర్చుకోవడం మానేశాను. మాధురి దీక్షిత్ డాన్స్ వీడియోలు చూస్తూ స్టెప్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. సాయి పల్లవి బాగా నటించదని ఎవరైనా అంటే.. మా అమ్మ నువ్వెక్కడ నటించావే  ఇంట్లో ఉన్నట్లే ఉన్నావు అంటుంది.

66


నా కెరీర్ లో ఫిదా, లవ్ స్టోరీ చిత్రాలు చాలా ప్రత్యేకం. అందుకు దర్శకుడు శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు చెప్పాలి. ముఖ్యంగా ఫిదా మూవీతో  నా ప్రయాణం మారిపోయింది. ఆలోచన విధానం కూడా శేఖర్ కమ్ముల మార్చేశారు. హీరో నుండి లైట్ బాయ్ వరకు ఆయన అందరినీ సమానంగా చూస్తారు. ఎక్కడైనా నీ హక్కులు కాపాడుకోవడానికి పోరాడు అంటారని సాయి పల్లవి శేఖర్ కమ్ములను పొగడ్తలతో ముంచెత్తింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image2
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image3
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved