నాజూగ్గా ఉండటానికి కారణం అదే.. సాయిపల్లవి ఫిట్ నెస్ సీక్రేట్.. ఏమన్నదంటే..?
కూల్ గా కామ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది సాయి పల్లవి పెద్దగా హడావిడి చేయదు. స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్నా కాని.. సింపుల్ గా ఉంటుంది. చుట్టు జనాలతో సెలబ్రిటీ అన్న డాంబికం చూపించుకోదు. మేకప్ లు.. ఫ్యాషన్ డ్రెస్ లు.. ఇలా ఏం ఉండవు. సింపుల్ గా వచ్చి సినిమా చేసి వెళ్తుంది బ్యూటీ.

Sai Pallavi
కథ నచ్చితేనే సినిమా చేస్తుంది సాయి పల్లవి. హీరో ఎవరైనా సరే.. ఎంత పెద్ద స్టార్ అయిన సరే. కథలో హీరోయిన్ పాత్రకు యాక్టింగ్ స్కోప్ ఉంటేనే చేస్తాను అంటుంది. లేదంటే నిర్మోహమాటంగా నోచెప్పేస్తుంది. అలా అని ఆమె ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా పోలేదు. ఇప్పటికీ ఆమె గుమ్మం ముందు గ్రీన్ సిగ్నల్ కోసం ఎంతో మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.
ఇక చాలా మంది స్టార్ హీరోయిన్లు తయ గ్లామర్ ను ఫిట్ నెస్ ను కాపాడుకోవడం కోసం కోట్లు ఖర్చు చేస్తుంటారు. జిమ్ముల్లో గంటలు గంటలు గడుపుతుంటారు. తిండి మానేసి పస్తులుంటారు. కాని సాయి పల్లవి మాత్రం అలా కాదు. తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ.. సాయి పల్లవి గ్లామర్ లో కాని.. ఫిజిక్ లో కాని ఏమాత్రం తేడా రాలేదు
Sai Pallavi
అదే నాజూకు సోకులతో సందడి చేస్తుంది బ్యూటీ. మేకప్ లేకుండానే నటిస్తూ.. ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది చిన్నది. సాయి పల్లవికి సౌత్ లో.. ముఖ్యంగా.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. మిగతా భాషల్లో కంటే తెలుగులో సాయి పల్లవికి ఉన్న ఫాలోయింగ్ ఎక్కువ.
Sai Pallavi
ఇక సాయిపల్లవి తన ఫిట్ నెస్ సీక్రేట్ ను బయట పెట్టింది. తాను ఇంత నాజూగ్గా ఉండటానికి కారణం ఏంటో కూడా వెల్లడించింది. తాజాగా ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పాల్గోన్న సాయి పల్లవి... మాట్లాడుతూ.. తనను అందరూ తన ఫిట్ నెస్ గురించి.. గ్లమర్ గురించి అడుగుతుంటారు అంటూ చెప్పకొచ్చింది. అని కాని నేను దాని కోసం ప్రత్యేకంగా ఎలాంటి కసరత్తులు చేయను. అన్నారు సాయి పల్లవి.
నేచురల్ యాక్టింగ్ ఒక ఎత్తయితే.. ఆమె డాన్స్ ఒక ఎత్తు.. డాన్స్ విషయంలో ఆమెకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో చేయడానికి సరైన కథ కోసం వెయిట్ చేస్తుంది.ఇక రీసెంట్ గా సాయి పల్లవి తన ఫిట్ నెస్ సీక్రేట్ ను బయట పెట్టారు. ఇలా నాజూగ్గా ఉండటానికి కారణం మాత్రం డాన్స్ అని అంటుంది సాయి పల్లవి. ఏ మాత్రం ఖాళీ దొరికినా నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాను. అదే నా ఫిట్ నెస్ కి కారణం.
తాజా ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ .. మేకప్ వేసుకుంటే నాపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందునే నేను ఏ సినిమాకు పెద్దగా మేకప్ వేసుకోను.. నేను బయట ఎలా ఉంటానో అలాగే కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడతాను అని అన్నారు. అయితే నాకు ఎంతో ఇష్టమైన డాన్స్ నాకు ఇంతటి పేరు ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ.. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది సాయి పల్లవి.