- Home
- Entertainment
- పాన్ ఇండియా డైరెక్టర్ తో మూవీ, స్టార్ హీరోతో ఎఫైర్..40 ఏళ్ళ హీరోయిన్ కెరీర్ పతనానికి కారణాలు ఇవేనా ?
పాన్ ఇండియా డైరెక్టర్ తో మూవీ, స్టార్ హీరోతో ఎఫైర్..40 ఏళ్ళ హీరోయిన్ కెరీర్ పతనానికి కారణాలు ఇవేనా ?
హీరోయిన్లు తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంటే వాళ్ళకి అవకాశాలు క్యూ కడతాయి. కానీ సదా విషయంలో అలా జరగలేదు. నితిన్ జయం చిత్రంతో సదా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది.

Sadha
హీరోయిన్లు తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంటే వాళ్ళకి అవకాశాలు క్యూ కడతాయి. కానీ సదా విషయంలో అలా జరగలేదు. నితిన్ జయం చిత్రంతో సదా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో సదా హోమ్లీ లుక్, డైలాగ్స్ యువతని విపరీతంగా ఆకట్టుకున్నాయి. సదా ఈ చిత్రం తర్వాత తిరుగులేని స్టార్ గా ఎదుగుతుంది అని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
Actress Sadha
అవకాశాలు వచ్చాయి కానీ నెమ్మదిగా వచ్చాయి. ఎన్టీఆర్ తో కలసి నటించిన నాగ చిత్రం డిజాస్టర్ అయింది. కానీ సదాని మరోసారి అదృష్టం తలుపుతట్టింది. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అపరిచితుడు చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. మూవీ తిరుగులేని బ్లాక్ బస్టర్. సదాకి కూడా మంచి పేరొచ్చింది. కానీ షూటింగ్ సమయంలో సదా ఎప్పుడూ తన తల్లి వెంటే ఉంటూ దర్శకుడు, హీరోతో అంతగా కలిసేది కాదట.
దీనితో విక్రమ్, శంకర్ సదాని ఇతర దర్శకులకు రికమండ్ చేయలేదు అనే రూమర్స్ ఉన్నాయి. కానీ అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సదా కెరీర్ వేగం పుంజుకోవాల్సింది పతనమవుతూ వచ్చింది. అదే టైంలో రొమాంటిక్ హీరో మాధవన్ తో కలసి సదా వెంటవెంటనే ప్రియసఖి, నేను తను ఆమె లాంటి చిత్రాల్లో నటించింది. ప్రియసఖి చిత్రంలో మాధవన్ తో సదా చేసిన రొమాన్స్ అప్పట్లో హాట్ టాపిక్.
ఈ చిత్రంతో సదా మాధవన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. వీళ్ళిద్దరూ కొన్ని నగరాల్లో తిరిగారని రూమర్స్ వినిపించాయి. కానీ ఆ రూమర్స్ ని సదా ఖండించింది. షూటింగ్ లో ఎప్పుడూ నా వెంట మా అమ్మ ఉంటుంది. అలాంటప్పుడు మరొకరితో ఎలా తిరుగుతాను అని సదా ఆ రూమర్స్ ని ఖండించింది.
ఆ తర్వాత సదా కెరీర్ పూర్తిగా డల్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం సదా టివి షోలతో బిజీగా ఉంది. 40 ఏళ్ళు వయసు వచ్చినా సదా ఇంకా పెళ్లి ఊసు ఎత్తడం లేదు. పెళ్లి గురించి అడిగితే తన మనసుకి నచ్చిన వాడు దొరకడం లేదని చెబుతోంది.