MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వెన్నెలను మింగేసిందా, దేవకన్యే భువికి దిగొచ్చిందా? చంపేసే సదా సోయగాలు!

వెన్నెలను మింగేసిందా, దేవకన్యే భువికి దిగొచ్చిందా? చంపేసే సదా సోయగాలు!

కొందరి విషయంలో ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే. వయసు పెరుగుతున్నా సదా గ్లామర్ ఇంచు కూడా తగ్గలేదు. చెప్పాలంటే ఇంకా అంతకంతకూ పెరుగుతోంది 

2 Min read
Sambi Reddy
Published : Sep 09 2023, 08:45 PM IST| Updated : Sep 09 2023, 08:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Heroine Sadaa

Heroine Sadaa

వన్నె తరగని అందాలతో మంత్రముగ్దులను చేస్తుంది హీరోయిన్ సదా(Sadaa). రోజ్ కలర్ ఫ్రాక్ లో ఆమె దేవకన్యలా మెరుస్తుంది. ఆమె మేని మెరుపు చేస్తుంటే వెన్నెలను మింగేసిందేమో అనే సందేహం కలుగుతుంది. సదా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 


 

27
Heroine Sadaa

Heroine Sadaa

కొన్నాళ్లుగా సదా బుల్లితెర షోలలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న నీతోనే డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. . ఈ షోకి సదా, రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా ఉన్నారు. నీతోనే డాన్స్ షోకి సదా ప్రత్యేక ఆకర్షణ అవుతున్నారు. 

37
Heroine Sadaa

Heroine Sadaa

నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సదా క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది. ఇటీవల విడుదలైన అహింస మూవీతో సదా రీఎంట్రీ ఇచ్చింది.  దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీగా దర్శకుడు తేజా తెరకెక్కించాడు. అహింస మూవీలో సదా కీలక రోల్ చేసింది. ఈ మూవీ నిరాశపరిచింది. 

47
Heroine Sadaa

Heroine Sadaa

దర్శకుడు తేజా సదాను వెండితెరకు పరిచయం చేశాడు. తేజా కెరీర్లో అతి పెద్ద హిట్ గా ఉన్న జయం చిత్రంలో సదా హీరోయిన్ గా చేశారు. నితిన్-సదా జంటగా నటించారు. జయం మూవీ సదాను ఓవర్ నైట్ స్టార్ చేసింది. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. 

 

57
Heroine Sadaa

Heroine Sadaa

అనంతరం ఎన్టీఆర్ కి జంటగా నాగ చిత్రం చేసింది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాగ ఆశించిన స్థాయిలో ఆడలేదు. సదా జతకట్టిన మరో పెద్ద హీరో బాలకృష్ణ. వీరి కాంబోలో తెరకెక్కిన వీరభద్ర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మంచి ఆరంభం లభించిన  సదా కెరీర్ నిర్మించుకోలేకపోయింది. స్టార్ లేడీగా ఇండస్ట్రీని ఊపేస్తోంది అనుకుంటే టైరు టూ హీరోలకు పడిపోయారు. తెలుగులో ఎన్టీఆర్, బాలకృష్ణ తప్పితే పెద్ద హీరోలు ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు. 
 

67
Heroine Sadaa

Heroine Sadaa

అనూహ్యంగా శంకర్ డైరెక్షన్ లో అపరిచితుడు చేసే అవకాశం దక్కింది. అగ్రహారం బ్రాహ్మణ అమ్మాయి పాత్రకు సదాను ఎంపిక చేశారు. శంకర్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆ పాత్రకు సదా వంద శాతం న్యాయం చేసింది. అపరిచితుడు భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత సదాకు మరో హిట్ పడలేదు. దాంతో హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యింది. 

 

77
Heroine Sadaa

Heroine Sadaa

కాగా సదాకు పెళ్లి అంటే ఇష్టం లేదట. పెళ్లితో స్వేచ్ఛ కోల్పోతాము. అందులో నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ని జంతువులను ఇష్టపడతాను. వివాహం పట్ల ఆసక్తి లేదని ఆమె చెప్పడం సంచలనమైంది. సదా వయసు 39 ఏళ్లు కాగా వివాహ బంధంలో అడుగు పెట్టను అంటుంది.   హీరోయిన్ గా రిటైర్ అయినప్పటికీ సదా అందం ఇసుమంత తగ్గలేదు. నాలుగు పదుల వయసులో కూడా వన్నె తరగని మేని ఛాయతో మైమరిపిస్తోంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved