- Home
- Entertainment
- విజయ్ దేవరకొండ చొక్కా వేసుకుని పబ్లిక్ లోకి వచ్చిన రష్మిక... ప్రేమికులు కాకపోతే మరేంటి?
విజయ్ దేవరకొండ చొక్కా వేసుకుని పబ్లిక్ లోకి వచ్చిన రష్మిక... ప్రేమికులు కాకపోతే మరేంటి?
విజయ్ దేవరకొండ-రష్మిక మందాన రిలేషన్ లో ఉన్నారనే న్యూస్ ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. దీన్ని ధృవీకరించేదిగా తాజా ఘటన ఉంది.

Vijay Devarakonda
విజయ్ దేవరకొండ ఎక్కడికెళ్లినా రష్మిక పక్కనే ఉంటుంది. ఆ మధ్య విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ట్రిప్ లో కూడా రష్మిక కనిపించింది. ఆయన పేరెంట్స్ తో పాటు దుబాయ్ వెళ్లారు. వారితో రష్మిక జాయిన్ అయ్యారు. అలాగే గతంలో రెండు పర్యాయాలు రష్మిక-విజయ్ దేవరకొండ మాల్దీవ్స్ వెళ్లారు.
Vijay Devarakonda-Rashmika Mandanna
ఈ విషయాన్ని రష్మిక ధృవీకరించారు. విజయ్ గుడ్ ఫ్రెండ్, అతనితో ట్రిప్ కి వెళితే తప్పేంటని ఆమె ఎదురు ప్రశ్నించారు. రష్మిక విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులకు కూడా దగ్గరయ్యారు. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే చిన్న చిన్న వేడుకలకు, బర్త్ డే ఫంక్షన్స్ కి రష్మిక హాజరవుతారు. ఇదంతా స్నేహంలో భాగమే. మా మధ్య ఎఫైర్, లవ్ లేదని రష్మిక పలుమార్లు వెల్లడించారు. తమపై వచ్చే రూమర్స్ ని కూడా చదివి ఎంజాయ్ చేస్తానని రష్మిక ఓ సారి చెప్పారు.
జనాలు మాత్రం వాళ్ళది కేవలం ఫ్రెండ్షిప్ అంటే నమ్మడం లేదు. మరోసారి ఈ ఎఫైర్ రూమర్ తెరపైకి వచ్చింది. అందుకు రష్మిక ధరించిన షర్ట్ కారణమైంది. గతంలో విజయ్ దేవరకొండ ధరించి షర్ట్ ని పోలిన షర్ట్ ధరించి రష్మిక కనిపించారు. దాంతో విజయ్ దేవరకొండ బట్టలు కూడా రష్మిక వాడేస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
వారు ఒకరి దుస్తులు మరొకరు వేసుకుంటున్నారు. ఇంత కంటే ఆధారం ఏం కావాలని బల్లగుద్దుతున్నారు. ఓ వర్గం ఈ వాదనలను ఖండిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఓ గార్మెంట్ బ్రాండ్ నడుపుతున్నాడు. ఆ బ్రాండ్ కి చెందిన సేమ్ డిజైన్ షర్ట్స్ విజయ్ దేవరకొండ, రష్మిక వాడారు. అందులో తప్పేముందని సమర్థిస్తున్నారు. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది.
ఇక రష్మిక కెరీర్ పీక్స్ లో ఉంది. ఈ స్టార్ లేడీ బడా బడా స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారు. పుష్ప మూవీతో రష్మిక మందాన ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నారు. అనతి కాలంలో ఎదిగిన ఈ లక్కీ లేడీ సౌత్ టు నార్త్ దున్నేస్తున్నారు.
పుష్ప 2, యానిమల్ చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. పుష్ప 2 రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో దర్శకుడు సుకుమార్ భారీగా తెరకెక్కిస్తున్నారు. పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. రన్బీర్ కపూర్ కి జంటగా నటించిన యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుంది. రైన్ బో టైటిల్ తో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు.