MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • 27 ఏళ్లకే అన్ని కోట్ల ఆస్తులా..? రష్మిక మందన్న వ్యాపారాలు, లగ్జరీ లైఫ్, కార్లు, ప్రోపర్టీ డీటేయిల్స్..?

27 ఏళ్లకే అన్ని కోట్ల ఆస్తులా..? రష్మిక మందన్న వ్యాపారాలు, లగ్జరీ లైఫ్, కార్లు, ప్రోపర్టీ డీటేయిల్స్..?

చాలా చిన్నవయస్సులోనే కోటీశ్వరురాలు అయిపోయింది హీరోయిన్ రష్మిక మందన్నా. సినిమాలు చేస్తూనే.. చాలా తెలివిగా.. వ్యాపారాలు చేస్తూ.. భారీగా ఆస్తులు కూడబెడుతోంది. ఇంతకీ రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 07 2024, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రష్మిక మందన్నా.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్.. పాన్ ఇండియా హీరోయిన్.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకున్న ఈ తార.. కన్నడ సినిమాల ద్వారా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. ప్రస్తుతం టాప్ లాంగ్వేజ్  సినిమాలలో స్టార్ హీరోలందరి సరసన మెరుస్తూ.. సూపర్ హిట్ సినిమాలు అందుకుంటుంది బ్యూటీ. రీసెంట్ గా హిందీలో యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది బ్యూటీ.. రణ్ బీర్ కపూర్ జంటగా నటించింది. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పుష్ప సినిమాతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం పుష్ప2 తో అంతకు మించి ఇమేజ్ ను సాధించడానికి రెడీగా ఉంది రష్మిక. ఇక ఆమె చాలా చిన్నవయస్సులోనే కోట్లకు కోట్లు కూడబెడుతుందని ఇండస్ట్రీలో టాక్. 27 ఏళ్లకే కోటీశ్వరురాలిగా మారిన రష్మికకు బెంగళూరు, కూర్గ్, గోవా, హైదరాబాద్, ముంబై సహా నగరాల్లో ఇళ్లు ఉన్నాయట. ఇందులో రష్మిక బెంగళూరులోని లగ్జరీ ఇంటి విలువ 10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. 
 

37

ఇక సినిమాల్లో నటించడమే కాకుండా పలు వ్యాపారాలు కూడా చేస్తుందట రష్మిక మందన్న. మరీ ముఖ్యంగా ఆమె తను సినిమాల్లో సంపాదించని డబ్బును తన తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతందని సోసల్ మీడియా కోడై కూస్తోంది. దాంతో తన ఆస్తులతో పాటు.. సంపద కూడా భారీగా పెరుగుతూ వస్తోందట. ప్రస్తుతం రష్మికకు 70 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్టు సమాచారం. 
 

47
Rashmika Mandanna

Rashmika Mandanna

రష్మిక ఆస్తులకు సబంధించి అసలు నిజం తెలియదు కాని.. సోసల్ మీడియాలో మాత్రం ఆమె ఆస్తులపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రష్మికకు కార్లంటే చాలా ఇష్టం మరియు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు అతని గ్యారేజీలో వరుసలో ఉన్నాయి. రష్మికకు ఇష్టమైన కారు ఆడి క్యూ3, అధునాతన ఫీచర్లతో కూడిన జర్మన్ SUV, ఆమె ఎక్కువగా ఉపయోగించేది. 
 

57

ఇక కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన  రష్మిక 2016లో కన్నడ సినిమా క్రిక్ పార్టీతో హీరోయిన్‌గా  ఎంట్రీ ఇచ్చింది. ఆసినిమా హిట్ అవ్వడంతో.. వెంటనే ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు స్టార్ట్ అయ్యాయి. ఛలో సినిమాతో తెలుగు పరిశ్రమలోకి వచ్చిన ఆమె విజయ్ దేవరకొండ జోడీగా రెండు సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది బ్యూటీ. విజయ్ తో చేసిన గీత గోవిందం సూపర్ హిట్ అవ్వగా.. డియర్ కాంమ్రేడ్ మాత్రం డిజాస్టర్ అయ్యింది. 
 

67

రష్మిక-విజయ్ దేవరకొండల కెమిస్ట్రీ గీత గోవిందం సినిమాతో బాగా సెట్ అయ్యింది. ఈసినిమా నుంచి వీరు ప్రేమలో ఉన్నారు అన్న రూమర్స్ ఉన్నాయి. ఇప్పటికీ వీరిపై రనకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.  టాలీవుడ్ లో టాప్ హీరోలతో నటించింది రష్మిక.  మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి అగ్ర నటుల సరసన నటించి తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగొందింది రష్మిక.
 

77

టాలీవుడ్ తర్వాత కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది రష్మిక. తమిళంలో కార్తీ సరసన నటించిన ఆమె ఆ తర్వాతి సినిమాలోనే తలపతి విజయ్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుని కోలీవుడ్ మార్కెట్‌ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో 2 సినిమాలు, తెలుగులో 2 సినిమాలు మరియు హిందీలో 3 సినిమాలు చేసింది. వరుసగా సినిమా అవకాశాలు వస్తుండటంతో ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ పెంచేస్తోంది రష్మిక. గతేడాది వరకు ఓ సినిమాకు రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న రష్మిక.. ప్రస్తుతం 5 కోట్లకు పైగా డిమాండ్ చేస్తుందట. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved