- Home
- Entertainment
- కళ్ళతో కవ్విస్తూ నవ్వులతో చంపేస్తున్న రాశి ఖన్నా... స్టార్ లేడీ ట్రెడిషనల్ లుక్ కేక!
కళ్ళతో కవ్విస్తూ నవ్వులతో చంపేస్తున్న రాశి ఖన్నా... స్టార్ లేడీ ట్రెడిషనల్ లుక్ కేక!
రాశి ఖన్నా నిండైన చీరకట్టులో మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. కళ్ళతో కవ్విస్తూ నవ్వులతో చంపేస్తుంది. రాశి లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.

Raashi Khanna
హీరోయిన్ రాశి ఖన్నా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. ఆమె పట్టు చీరలో సరికొత్తగా దర్శనమిచ్చింది. సాంప్రదాయ కట్టులో కూడా కూడా రాశి గ్లామర్ మైమరిపించేలా ఉంది. ఫ్యాన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతుంటే... ఫోటోలు వైరల్ అవుతున్నాయి
Raashi Khanna
మరోవైపు రాశి కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఇతర పరిశ్రమల్లో ఆఫర్స్ వస్తున్నా స్టార్ కాలేకపోతుంది. టాలీవుడ్ లో ఆమె జర్నీ ముగిసిన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాశి చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. 2022లో రాశి ఖన్నా హీరోయిన్ గా థాంక్యూ, పక్కా కమర్షియల్ విడుదలయ్యాయి. ఇవి రెండు డిజాస్టర్స్ అయ్యాయి.
Raashi Khanna
ఆ రెండు చిత్రాల పరాజయాలతో రాశి ఖన్నాకు టాలీవుడ్ లో దారులు మూసుకుపోయాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. యోధ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.
Raashi Khanna
మరోవైపు తమిళంలో అరణ్మణై, మేథావి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. 2020 తర్వాత రాశి ఖన్నా తమిళంలో అధికంగా చిత్రాలు చేయడం విశేషం. కార్తీకి జంటగా ఆమె నటించిన సర్దార్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Raashi Khanna
దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఊహలు గుసగుసలాడే రాశి ఖన్నాకు బ్రేక్ ఇచ్చింది. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. జిల్, శివమ్, హైపర్, బెంగాల్ టైగర్ ఇలా వరుస ఆఫర్స్ పట్టేసింది. హిట్ ట్రాక్ లేకున్నా ఎన్టీఆర్ జై లవకుశ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు.
Raashi Khanna
దర్శకుడు బాబీ తెరకెక్కిన జైలవకుశ సూపర్ హిట్ కొట్టింది. అయితే రాశి కెరీర్ కి జై లవకుశ ప్లస్ కాలేదు. ఆమెకు టైర్ టూ హీరోల సరసన మాత్రమే ఆఫర్స్ వచ్చాయి. అదే సమయంలో డిజిటల్ సిరీస్లు చేస్తున్నారు. రుద్ర టైటిల్ తో ఒక క్రైమ్ థ్రిల్లర్ చేసింది.
Raashi Khanna
రాశి నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ పార్జీ. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు చేశారు. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న పార్జీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫేక్ నోట్స్ కనిపెట్టే ఎక్స్పర్ట్ గా రాశి ఖన్నా కనిపించారు.