ఫస్ట్ టైం తన కొడుకును చూపించిన పూర్ణ... అచ్చు అమ్మ పోలికేనట!
హీరోయిన్ పూర్ణ తన కుమారుడిని ఫస్ట్ టైం అభిమానులకు చూపించారు. ఇంస్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు.

Purnaa
పూర్ణ ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు దుబాయ్ లో ప్రసవం జరిగింది. మొదటి సంతానంగా అబ్బాయి పుట్టాడు. ఫస్ట్ టైం తన కొడుకును పూర్తిగా రివీల్ చేశారు. మదర్స్ డే రోజు కొడుకు, భర్తతో పాటు ఫోటో దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ది ప్రిన్స్ అని కామెంట్ పెట్టింది.
Purnaa
పూర్ణ కొడుకును చూసిన అభిమానులు బాబు చాలా అందంగా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అచ్చు అమ్మ పోలికే అని కొనియాడుతున్నారు. పూర్ణ కొడుకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత ఏడాది పూర్ణ దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త ఫహద్ అసిఫ్ అలీని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి రహస్యంగా జరిగింది. దుబాయ్ లో అత్యంత సన్నిహితుల మధ్య పూర్తి చేశారు.
Purnaa
పెళ్ళైన వెంటనే గర్భం దాల్చిన పూర్ణ అబ్బాయిని కన్నారు. ఇక పూర్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అఖండ, దృశ్యం 2, తీస్ మార్ ఖాన్ చిత్రాల్లో ఆమె కీలక రోల్స్ చేశారు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దసరాలో విలన్ భార్యగా కనిపించారు.
Purnaa
వివాహం తర్వాత కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు. సినిమాలతో పాటు బుల్లితెర షోలలో సందడి చేస్తున్నారు. పూర్ణకు మంచి ఆరంభం లభించింది. పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని కారణాల వలన పలు ఆఫర్స్ వదులుకున్నాను, అది నా కెరీర్ కి మైనస్ అయ్యిందని పూర్ణ గతంలో వెల్లడించారు.
Purnaa
చూస్తుంటే పూర్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అవుతారనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ రావడంతో కొంచెం గ్యాప్ ఇచ్చింది. మరలా ఆమె నటిగా బిజీ కానుంది. మలయాళ అమ్మాయి అయినప్పటికీ పూర్ణకు తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. దర్శకుడు రవిబాబుతో పూర్ణ ఎఫైర్ నడిపారనే పుకార్లు వినిపించాయి. ఈ వార్తలను రవి బాబు ఖండించారు. వీరి కాంబోలో పలు చిత్రాలు తెరకెక్కాయి...