ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. మనసులో మాట బయటపెట్టిన ప్రియమణి
ఇన్నాళ్ళకు మనసులో మాట బయటపెట్టింది సినియర్ హీరోయిన్ ప్రియమణి, సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. తన ఫస్ట్ క్రష్ గురించి సీక్రెట్ రివిల్ చేసింది.

Priyamani
ఈ మధ్య కాలం వరకూ కూడా.. త్రిష,శ్రియా లాంటి హీరోయిన్లతో సమానంగా టాలీవుడ్ ను ఏలిన హీరోయిన్ ప్రియమణి. ఎన్టీఆర్ లాంటి యంగ్ హీరోలతో.. జగపతి బాబు లాంటి సీనియర్ స్టార్లతో కూడా జతకట్టిన ఈ బ్యూటీ.. పెళ్ళి తరువాత కొంత కాలం పాటు వెండితెరకు దూరం అయ్యింది.
పెళ్లి తరువాత కొంత కాలం స్క్రీన్ కు దూరం అయిన ప్రియమణి.. ఆతరువాత సెకండ్ ఇన్నింగ్స్ ను పక్కా ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసింది. వరుసగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది హీరోయిన్ ప్రియమణి. ముఖ్యంగా ఆమె చేసిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సూపర్ హిట్అయ్యింది. ప్రియమణికి మంచి ఇమేజ్ వచ్చింది. వరుస ఆఫర్లను కూడా తీసుకువచ్చింది.
ఇటు టాలీవుడ్ లోను... అటు బాలీవుడ్ లోను దూసుకుపోతోందిప్రియమణి. ఆమెకు వచ్చే క్యారెక్టర్ రోల్స్ కూడా అందరూ గుర్తు పెట్టుకునే విధంగా ఉంటున్నాయి. తాజాగా బాలీవుడ్ బాద్ షా.. షారుక్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్ లో ఇంపార్టెంట్ రోల్ చేసింది ప్రియమణి. ఇందులో ఆమెది చాలా కీలక పాత్ర. ఇక ఈమూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రియమణి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు.
ప్రమోషన్లలో భాగంగా వరుసఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రియమణి..ఓ మీడియా సంస్థతతో ముచ్చటిస్తూ.. పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారామె.బాలీవుడ్ నటుల్లో ఎవరిపైనైనా క్రష్ ఉందా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు ప్రియమణి. ”బాలీవుడ్ నటుల్లో ఎవరి స్టయిల్ వారిదే. నాకు చాలా మంది నటులు ఇష్టం. కొన్ని అభిమాన పాత్రలు కూడా ఉన్నాయి అన్నారు ప్రియమణి.
అయితే తనకు ఫస్ట్ నుంచి క్రష్ ఉన్న ఏకైక స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అని అసలు విషయం వెల్లడించారు ప్రియమణి. లక్కీగా షారుక్ తో వర్క్ చేసే అవకాశం రావడం చాలా అనందంగా వుంది. ఆయనతో మరిన్ని ప్రాజెక్ట్‌లు చేయాలని కోరికగా ఉంది అనిఅన్నారు ప్రియమణి.
ఇక ప్రస్తుతం పుష్ప2 లో నటిస్తోంది ప్రియమణి. ఈసినిమాలో ఆమెది అద్భుతమైన పాత్ర అని అంటున్నారు మేకర్స్. అయితే ఏ పాత్రలో ఆమె కనిపించబోతుంది అనేది మాత్రం తెలియడంలేదు. ఈపాత్ర సర్ ప్రైజింగ్ గా ఉంటుందని అంటున్నారు.
ఎన్టీఆర్ దేవర చిత్రంలో ప్రియమణి నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అది కూడా ఎన్టీఆర్ తల్లి పాత్ర అట. ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న క్రమంలో ప్రియమణి ఎన్టీఆర్ తల్లి, భార్య రెండు పాత్రల్లో కనిపిస్తారట. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని...ప్రచారం మాత్రం జరుగుతోంది.