Pranita Subhash: యద అందాలకు పూలు అడ్డుపెట్టి కొంటెగా కవ్విస్తున్న పవన్ హీరోయిన్... స్టైలిష్ లుక్ లో ప్రణీత !
పవన్ హీరోయిన్ ప్రణీత సుభాష్ స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది. వింటర్ వేర్ ధరించి సో స్టైలిష్ గా ఉంది. యద అందాలకు పూలు అడ్డుగా ఉంచి కొంటె చూపులతో కవ్వించింది.
Pranita Subhash
ఇక న్యూ ఇయర్ మూడ్ లో ప్రణీత ఉన్నట్లు అర్థం అవుతుంది. తన లేటెస్ట్ ఫోటోస్ కి ప్రణీత కొత్త సంవత్సరానికి ఇంకా 17 రోజులు మాత్రమే అని కామెంట్ జోడించారు. 2023 ని ప్రణీత గ్రాండ్ గా వెల్కమ్ చెప్పనున్నారని తెలుస్తుంది.
Pranita Subhash
2022 ప్రణీత లైఫ్ లో కీలకమైనది అనాలి. ఎందుకంటే ఈ ఏడాది ఆమె తల్లి అయ్యారు. పండంటి అమ్మాయికి జన్మనిచ్చారు. తల్లి తనం కంటే ఒక అమ్మాయి జీవితంలో పెద్ద విజయం ఏముంటుంది చెప్పండి.
Pranita Subhash
కాగా 2021 మార్చి 30న ప్రణీత సుభాష్ బెంగుళూరుకి చెందిన బిజినెస్ మాన్ నితిన్ రాజును వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య ప్రణీత వివాహం జరిగింది. అటు తల్లిగా, నటిగా రెండు బాధ్యతలు ప్రణీత నెరవేరుస్తున్నారు.
Pranita Subhash
భర్త అనుమతితో హీరోయిన్ గా ప్రణీత(Pranita Subhash) కెరీర్ కొనసాగిస్తున్నారు . ప్రస్తుతం ఆమె రామన అవతార అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. టాలీవుడ్ మాత్రం ఆమె ఫేడ్ అవుట్ అయ్యారు. తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఆ మూవీలో చిన్న క్యామియో రోల్ చేశారు.
ఎన్టీఆర్(NTR), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వంటి స్టార్స్ తో ప్రణీత జతకట్టారు. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. ఆ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. ఇక ఎన్టీఆర్ కి జంటగా రభస చిత్రం చేశారు. ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు.
ఇటీవల బాలీవుడ్ లో కూడా అదృష్టం పరీక్షించుకున్నారు ప్రణీత. వరుసగా రెండు హిందీ చిత్రాలు చేశారు. హంగామా 2, బుజ్ చిత్రాల్లో ప్రణీత హీరోయిన్ గా నటించారు.
కోవిడ్ సమయంలో ప్రణీత తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో పేదలకు అవసరమైన ఆహారం సొంత ఖర్చులతో అందించారు. ప్రణీత పేరెంట్స్ డాక్టర్స్ కాగా ఆ కోణంలో కూడా పలువురికి సహాయం చేసింది.