అది పీడకలైతే బాగుండు, ప్రైవేట్ వీడియో లీక్ పై స్పందించిన నటి!
యంగ్ హీరోయిన్ ప్రగ్య నగ్ర ప్రైవేట్ వీడియో అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఆ వీడియో పై ప్రగ్య నగ్ర స్పందించారు. ట్విట్టర్ వేదికగా కామెంట్ పోస్ట్ చేశారు.
హీరోయిన్ ప్రగ్య నగ్ర లీక్డ్ వీడియో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. గత రెండు రోజులుగా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ఉంది. ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ప్రగ్య నగ్ర వీడియో బయటకు వచ్చిందని వైరల్ చేశారు. ట్విట్టర్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో దర్శనం ఇచ్చింది.
కాగా ప్రగ్య నగ్ర సదరు వీడియోపై స్పందించారు. ఆమె స్పష్టత ఇచ్చారు. ఆ వీడియో తనది కాదంటూ ఆమె తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా ఓ భావోద్వేగ సందేశం ఆమె పంచుకున్నారు. నేను ఇప్పటికీ ఆ షాక్ నుండి కోలుకోలేదు. ఇదంతా నిద్రలేవగానే మరచిపోయే పీడకల అయితే బాగుండు అనిపిస్తుంది. సాంకేతికత మనకు మంచి చేయాలి. ఇలా చెడు కాదు.
pragya nagra
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ఇలాంటి ఫేక్ వీడియోలు చేస్తున్న వారి రాక్షస ఆలోచనలు చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. నేను స్ట్రాంగ్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాను. నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా పరిస్థితి మరొక మహిళకు రాకూడదని కోరుకుంటున్నాను. అందరూ భద్రంగా ఉండండి... అని కామెంట్ పోస్ట్ చేశారు.
ప్రగ్య నగ్ర హర్యానా రాష్ట్రానికి చెందిన అమ్మాయి. 2022లో ఓ తమిళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. రెండు తమిళ్, ఒక మలయాళ చిత్రం చేసింది. తెలుగులో ఆమె నటించిన లగ్గం మూవీ ఇటీవల విడుదలైంది. రాజేంద్రప్రసాద్, రేవతి వంటి స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో నటించారు. ఆశించిన స్థాయిలో అయితే ఆడలేదు. లీక్డ్ వీడియో అంటూ ప్రగ్య నగ్ర వార్తల్లో నిలిచింది.
Pragya Nagra
కాగా ఇటీవల డీప్ ఫేక్ వీడియో సాంకేతికతను పలువురు హీరోయిన్స్ బాధితులు అయ్యారు. రష్మిక మందాన, కాజోల్, ప్రియాంక చోప్రా, నోరా ఫతేహి వంటి హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రష్మిక డీప్ ఫేక్ వీడియో పై విచారణ జరిగింది. అందుకు కారణమైన యువకుడిని చాలా రోజుల అనంతరం అరెస్ట్ చేశారు.
తాజాగా ప్రగ్య నగ్ర బాధితురాలిగా మారారు. ఆమె సైబర్ క్రైం విభాగంలో ఫిర్యాదు చేశారు. ఫేక్, మార్ఫ్డ్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.