MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • స్టేజి మీద నీతులు చెప్పి జీవితాలతో ఆడుకునేవాడు గురువా..? పవర్ స్టార్ పై పూనమ్ ఇండైరెక్ట్ అటాక్!

స్టేజి మీద నీతులు చెప్పి జీవితాలతో ఆడుకునేవాడు గురువా..? పవర్ స్టార్ పై పూనమ్ ఇండైరెక్ట్ అటాక్!

పూనమ్ కౌర్ సంచలన పోస్ట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆమె లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా టార్గెట్ చేసినట్లు ఉంది. టాలీవుడ్ వర్గాల్లో ఇది సంచలనం రేపుతోంది. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 04 2023, 08:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


పూనమ్ కౌర్ టాలీవుడ్ ఫైర్ బ్రాండ్. నటిగా కంటే వివాదాలతో ఎక్కువ ఫేమస్ అయ్యారు. తరచుగా ఈమె సోషల్ మీడియా పోస్ట్స్ తో కాకరేపుతుంటారు. పూనమ్ కౌర్ పోస్ట్స్ ఓ ఇద్దరు స్టార్స్ ని పరోక్షంగా టార్గెట్ చేసినట్లు ఉంటాయి. అవి ఒకరు హీరో పవన్ కళ్యాణ్ మరొకరు దర్శకుడు త్రివిక్రమ్. వీలు దొరికినప్పుడా వీరిపై విరుచుకుపడుతూ ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


గతంలో ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ సీరియస్ అలిగేషన్స్ చేశారు. పూనమ్ కౌర్ జీవితాన్ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నాశనం చేశారన్నారు. నేను బయటపెట్టే ఈ నిజాలు ఆ అమ్మాయికి మంచే చేస్తాయంటూ ఓ ఛానల్ స్టూడియోలో కూర్చొని ఆధారాలు బయటపెట్టారు. అలిగేషన్స్ చేశారు. అయితే పూనమ్ కౌర్ ఫ్యామిలీ కత్తి మహేష్ ఆరోపణలను ఖండించారు. 
 

37


కానీ పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మీద అక్కసు వెళ్లగక్కుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో వీరిద్దరిపై ఆమె సీరియస్ కామెంట్స్ చేశారు. అయితే ఏనాడూ నేరుగా ఓపెన్ అయ్యింది లేదు. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. ఆయన గురు ఎలా అవుతాడంటూ మండి పడింది. 

47
Poonam Kaur

Poonam Kaur

గురు పౌర్ణమి సందర్భంగా బండ్ల గణేష్ ఓ ట్వీట్ చేశాడు.  ఆయన పవన్ కళ్యాణ్ ని గురు అని సంబోధిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. నా గురు లక్ష్యం నెరవరాలన్నారు. ఇకపై ఆయన ఫేమ్, నేమ్ వాడుకొని ఏ విధంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయను అన్నారు. సీఎం కావాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ గురు అని పిలిచిన నేపథ్యంలో పూనమ్ కౌర్ ఫైర్ అయ్యారు. 
 

57
Poonam Kaur

Poonam Kaur

పూనమ్ కౌర్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో... ప్రతి అడ్డమైనవాడిని గురు అని పిలవకండి. వేదికల మీద నీతులు చెప్పి జీవితాలతో ఆడుకునేవాడు గురువు కాదు. దారి చూపించేవాడు గురు అవుతాడు. దయచేసి అర్థం చేసుకోండి, అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించే అని నెటిజెన్స్ అభిప్రాయం. 
 

67

పొలిటికల్ లీడర్ గా వేదికల మీద నీతులు చెప్పే పవన్ జీవితాలు నాశనం చేశాడని ఆమె పరోక్షంగా ఆరోపించినట్లుగా ఈ కామెంట్ ఉంది. రాజకీయ, సినీ వర్గాల్లో ఆమె పోస్ట్ కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ ఈ పోస్ట్ వైరల్ చేస్తుండగా, పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

77

ఇక పూనమ్ కౌర్ అరుదుగా వెండితెర మీద కనిపిస్తున్నారు. 2022లో నాతిచరామి టైటిల్ తో ఓ మూవీ చేశారు. ఆ మూవీ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. 2006లో మాయాజాలం అనే మూవీతో పరిశ్రమలో అడుగుపెట్టిన పూనమ్ కౌర్ శౌర్య, వినాయకుడు, ఈనాడు, నాగవల్లి వంటి చిత్రాల్లో నటించారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Elimination: 2వ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతనేనా? సెలబ్రెటీ ఎలా డేంజర్ జోన్ లోకి వచ్చాడు?
Recommended image2
Aasmaan Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్‌‌ కొత్త మూవీ ఆస్మాన్‌ టీజర్‌ వచ్చింది.. వామ్మో ఇలా ఉందేంటి?
Recommended image3
600 కోట్ల విలువైన భూమిని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఇచ్చిన నటుడు, ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన 12 ఎకరాల భూమిలో ఇప్పుడు ఏముందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved