MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Pooja Hegde: పూజా హెగ్డేకు గాయాలు... బుట్టబొమ్మకు ఏమైందంటూ ఆందోళనలో ఫ్యాన్స్!

Pooja Hegde: పూజా హెగ్డేకు గాయాలు... బుట్టబొమ్మకు ఏమైందంటూ ఆందోళనలో ఫ్యాన్స్!

హీరోయిన్ పూజా హెగ్డేకు గాయాలు అయ్యాయి. సదరు ఫోటోలు ఆమె స్వయంగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 

Sambi Reddy | Published : Oct 05 2023, 08:58 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Pooja Hegde

Pooja Hegde

పూజా హెగ్డే షాక్ ఇచ్చింది. గాయాలు తగిలిన ఫోటోలు పంచుకోగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూజా హెగ్డే కాలిపై ఎర్రటి గాయాలు కనిపించాయి. వీటికి వివరణగా పూజా హెగ్డే 'యుద్దపు గాయాలు' అని క్యాప్షన్ పెట్టింది. అలాగే బాక్సింగ్ అని కూడా జోడించింది. 

 

26
Pooja Hegde

Pooja Hegde

కాబట్టి ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే బాక్సింగ్ చేశారు. దాంతో కాలికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇదే విషయాన్ని ఆమె తెలియజేశారు. మరి పూజా బాక్సింగ్ వ్యవయామంలో భాగంగా చేసిందా లేక ఏదైనా షూటింగ్ కోసం అలా కష్టపడిందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పూజా చేతిలో చిత్రాలు ఏమీ లేవు. 

36
Asianet Image

అలాగే పూజా హెగ్డేకు సర్జరీ జరిగినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కొన్నాళ్లుగా కాలి నొప్పితో బాధపడుతున్న పూజా సర్జరీ చేయించుకున్నారని సదరు కథనాల సారాంశం. పూజా కొన్ని ప్రాజెక్ట్స్ నుండి తప్పుకోవడానికి కూడా కారణం ఇదే అంటున్నారు. గతంలో పూజా హెగ్డే కాలికి కట్టుతో కనిపించారు. దీంతో సర్జరీ వార్తలకు బలం చేకూరింది. 

46
Asianet Image

మరోవైపు పూజా హెగ్డే(Pooja Hegde)కు బ్యాడ్ టైం నడుస్తుంది. కొత్త ఆఫర్స్ రాకపోగా వచ్చినవి కూడా చేజారుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ గుంటూరు కారం నుండి ఆమె తప్పుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఆమె రోల్ ప్రాధాన్యత తగ్గించి సెకండ్ హీరోయిన్ చేశాడట. దాంతో తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి గుంటూరు కారం కి గుడ్ బై చెప్పేసింది. 

 

56
Asianet Image

మహేష్ బాబు  సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తారనుకుంటే ఆ ఆశ కూడా చేజారింది. గత ఏడాది ఇలానే జనగణమన అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోల్పోయింది. నిర్మాతలు హ్యాండ్ ఇవ్వడంతో విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ ల డ్రీమ్ ప్రాజెక్ట్ అటకెక్కింది. 

66
Asianet Image

పూజా హెగ్డే కెరీర్ ప్రమాదంలో పడింది. వరుసగా ఆరు ప్లాప్స్  పడ్డాయి. పూజా హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ నిరాశపరిచింది.  ఎఫ్ 3 చిత్రంలో ఐటెం నంబర్ చేయగా ఆ చిత్రం కూడా నష్టాలు మిగిల్చింది. పూజా ఐరన్ లెగ్ ట్యాగ్ మూటగట్టుకుంది. 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories