టేబుల్ అడ్డుగా పెట్టి వాటిని దాచేసింది... ఆర్ ఎక్స్ 100 బేబీ పాయల్ పరువాల జాతర!
సిల్వర్ స్క్రీన్ పై జోరు తగ్గినా సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది పాయల్ రాజ్ పుత్. హాట్ ఫోటో షూట్స్ లో స్కిన్ షో చేస్తూ టెంపరేచర్ పెంచేస్తుంది. పాయల్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

Payal Rajput
ఇక పాయల్ రాజ్ పుత్ సీరియల్ యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు.. అనంతరం హీరోయిన్ అయ్యారు. కాగా ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2018 లో విడుదలైన ఆర్ఎక్స్ 100 మూవీ సంచలన విజయం నమోదు చేసింది. హీరోయిన్ పాయల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఇది ఓ న్యూ ఏజ్ లవ్ డ్రామా అని చెప్పొచ్చు.
Payal Rajput
బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చినా పాయల్ కి బ్రేక్ రాలేదు. ఎందుకో దర్శక నిర్మాతలు ఆమెను పట్టించుకోలేదు. పాయల్ జతకట్టిన పెద్ద హీరోల లిస్ట్ లో వెంకటేష్, రవితేజ మాత్రమే ఉన్నారు. వెంకీ మామ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేయగా... డిస్కో రాజా ప్లాప్ అయ్యింది. ఆ దెబ్బతో పాయల్ కెరీర్ తిరోగమనం పట్టింది.
Payal Rajput
చిత్ర పరిశ్రమలో విజయాల ఆధారంగానే అవకాశాలు వస్తాయి. అత్యంత తక్కువ సక్సెస్ రేట్ కలిగిన పాయల్ ని మెల్లగా దర్శక నిర్మాతలు దూరం పెట్టారు. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తున్న పాయల్ కి సరైన బ్రేక్ రావడం లేదు.పాయల్ లేటెస్ట్ మూవీ మాయా పేటిక థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం మొబైల్ వినియోగం ఎక్కువ కావడం వలన ఏర్పడే దుష్ప్రభావాలను తెలియజేస్తూ దర్శకుడు రమేష్ రాపర్తి తెరకెక్కిస్తున్నారు. సునీల్, హిమజ, పృథ్వి, శ్రీనివాసరెడ్డి కీలక రోల్స్ చేస్తున్నారు.
గత ఏడాది పాయల్ నటించిన తీస్ మార్ ఖాన్ ఆగస్టులో విడుదలైంది. ఆది హీరోగా నటించిన ఈ మూవీలో పాయల్ రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. కంటెంట్ పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా ఆడలేదు. అలాగే మంచు విష్ణుకు జంటగా జిన్నా చిత్రం చేసింది. ఆ మూవీ మొత్తంగా డిజాస్టర్ అయ్యింది.
మరోవైపు వెబ్ మూవీస్ లో నటిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విపరీతంగా అవకాశాలు దక్కుతుండగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే కన్నడ, తమిళ భాషల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.